జ్ఞానాపురం రక్షణగిరిపై కరుణామయుడు

జ్ఞానాపురం రక్షణగిరిపై కరుణామయుడు

 
జ్ఞానాపురం రక్షణగిరిపై కరుణామయుడు

విశాఖ అతిమేత్రాసనం , జ్ఞానాపురం లోని  రక్షణగిరి కొండపై 33 అడుగుల ఎత్తయిన ఏసుక్రీస్తు స్వరూపం(Christ The Redeemer statue) ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశాఖ అతి మేత్రాసన అగ్రపీఠాధిపతులు మహా పూజ్య  ఉడుముల బాల గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, ఈ విగ్రహ నిర్మాణానికి సహకరించిన కార్పొరేటర్ శ్రీమతి కొడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ గారితో కలసి ప్రత్యేక ప్రార్థనలు, ఆశీర్వచనాల అనంతరం స్వరూపాన్ని  ప్రారంభించారు.

 విచారణ కర్తలు జాన్ ప్రకాష్ గారు ఈ అందమైన విగ్రహ నిర్మాణానికి విశేష కృషి చేసిన  కార్పొరేటర్ శ్రీమతి కొడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో విశ్వాసులు , గురువులు , సిస్టర్స్ పాల్గొన్నారు. 

విశాఖ నగరానికి మరో ఆధ్యాత్మిక, పర్యాటక ఆకర్షణగా రక్షణగిరి కొండపై ఈ స్వరూపం నిలవనుంది.మన ప్రభువైన ఏసుక్రీస్తు వారి ప్రేమ, శాంతి, కరుణ, త్యాగ సందేశాలను చాటిచెబుతూ ఈ స్వరూపం  విశాఖ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని ఆకాంక్షిద్దాం.

Article and Design  BY M Kranthi Swaroop

Telugu Survey Popup Image