రేడియో వేరితాస్ ఆసియా సింహళ సేవకు స్వర్ణోత్సవ శుభాకాంక్షలు

శ్రీలంకలో విశిష్టమైన ప్రసార సేవలను అందిస్తున్న **రేడియో వేరితాస్ ఆసియా సింహళ  విభాగం 2026 నవంబర్ 7వ తేదీన తన స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్న శుభసందర్భంగా, RVA తెలుగు విభాగం వారి తరఫున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

గత ఐదు దశాబ్దాలుగా సువార్తా సందేశాన్ని, క్రైస్తవ విలువలను ప్రజలకు చేరవేస్తూ, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ మరియు సోదరభావాన్ని పెంపొందించడంలో సింహళ విభాగం వారు అందిస్తున్న సేవలు అభినందనీయం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అంకితభావంతో సేవలందించిన ప్రతి ఒక్కరికీ మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము.

మహా పూజ్య జయరావు పొలిమెర గారు- ఏలూరు పీఠాధిపతులు, RVA తెలుగు విభాగం అధ్యక్షులు, 
మహా పూజ్య రాయరాల విజయ్ కుమార్ గారు, P.I.M.E. శ్రీకాకుళం పీఠాధిపతులు, RVA తెలుగు విభాగం ఉపాధ్యక్షులు,
గురుశ్రీ పప్పుల సుధాకర్ రావు గారు - RVA తెలుగు విభాగం సమన్వయకర్తలు ఈ స్వర్ణోత్సవ శుభసందర్భంగా RVA తెలుగు విభాగం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు.

రేడియో వేరితాస్ ఆసియా సింహళ సేవ తన ప్రసార పరిచర్యను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తూ, భవిష్యత్తులోనూ అనేక మందికి విశ్వాస దీపంగా, నిరీక్షణ స్వరంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాము. 

దేవుని దీవెనలు మీ అందరిపై సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తున్నాము.

Telugu Survey Popup Image