డా. మల్లవరపు ప్రకాష్ గారి సేవలను స్మరించిన వైఎస్ జగన్
డా. మల్లవరపు ప్రకాష్ గారి సేవలను స్మరించిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు విశాఖ అతిమేత్రాసన విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహా పూజ్య. మల్లవరపు ప్రకాష్ గారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం ఆర్చ్‌బిషప్ ఎమిరిటస్ డా. మల్లవరపు ప్రకాష్ గారు దశాబ్దాల పాటు విశ్వాసులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించారని శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కొనియాడారు. విద్య, సామాజిక సేవ, మానవతా కార్యక్రమాల ద్వారా పేదలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన విశేష కృషి చేశారని పేర్కొన్నారు. విజయవాడ డియోసెస్‌కు బిషప్‌గా, మరియు విశాఖపట్నం ఆర్చ్‌బిషప్‌గా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గుర్తుచేసుకున్నారు. క్రైస్తవ సమాజ అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర విశిష్టమైందని నివాళులర్పించారు.
డాక్టర్ మల్లవరపు ప్రకాష్ గారి నాయకత్వం అనేక తరాల విశ్వాసులకు స్ఫూర్తినిచ్చిందని, సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం మరియు మానవతా విలువలను పెంపొందించడంలో దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. ఆయన మరణం క్రైస్తవ సమాజానికి మరియు రాష్ట్రానికి తీరని లోటని అభివర్ణించిన వైఎస్ జగన్, వారి కుటుంబ సభ్యులు, క్రైస్తవ మత పెద్దలు, శిష్యులు మరియు భక్తులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Article and Design by M Kranthi Swaroop