కాకినాడలో ఘనంగా తిరురక్త అభిషేక ప్రార్థనలు
కాకినాడలో ఘనంగా తిరురక్త అభిషేక ప్రార్థనలు
విశాఖ అతిమేత్రాసనం, కాకినాడ లోని యేసు మంచి కాపరి దేవాలయంలో తిరురక్త అభిషేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. విచారణ కర్త ఫాదర్ డొమినిక్ సావియో గారి ఆధ్వర్యంలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, యేసుక్రీస్తు తిరురక్త మహిమను స్మరించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.
ఈ కార్యక్రమంలో బ్రదర్ సత్యం గారు పాల్గొని దైవ సందేశాన్ని అందించి విశ్వాసులను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్లారు. ఈ ప్రార్థన కూటమి లో అధిక సంఖ్యలో విశ్వాసులు, విచారణ ప్రజలు పాల్గొన్నారు. ప్రార్థనా కూటమిలో పాల్గొన్న విశ్వాసులు భక్తి గీతాలు ఆలపిస్తూ దేవుని స్తుతించారు.
ఫాదర్ డొమినిక్ సావియో గారు విశ్వాసులకొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు. ప్రతి కుటుంబం ప్రార్థనా జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఫాదర్ డొమినిక్ సావియో గారు విశ్వాసులను కోరారు.పాల్గొన్న విశ్వాసులకు కందా మౌర్య గారి కుటుంబం ప్రేమ విందు ని అందించారు. విశ్వాసులు, యువతీ యువకులు , భక్తిశ్రద్ధలతో ఈ ప్రార్థనలలో పాల్గొని ఆ దేవాది దేవుని దీవెనలు పొందుకున్నారు.
Article and Design By M Kranthi Swaroop
