మన మహనీయులు

  • పునీత చిన్న యాకోబు, పునీత ఫిలిప్పు, 3 మే

    May 02, 2024
    పునీత చిన్న యాకోబు

    పునీత చిన్న యాకోబు గారినే జేమ్సు అని కూడా అంటాము. అనగా యాగప్ప గారు. వారు అల్ఫయీ కుమారుడు (అ. కా. 1:13) వీరు యేసు ప్రభువుకు శిష్యులు వరుసకు సహోదరుడు అవుతాడు. (మ. 13: 55, మా. 6: 3, గల. 1: 19) చిన్న యాకోబు గారి తల్లి క్లోఫా మరియా (యో. 19: 25), కన్య మరియమ్మ అక్క చెల్లెండ్రు అవుతారని చరిత్ర తెలియచేస్తుంది. చిన్న యాకోబు గారు అనగా యాగప్ప గారు అనగా అందమైన, భక్తి గల, విరక్తత్వము గల వ్యక్తి అని తెలుస్తుంది.

    చిన్న యాకోబు గారు పవిత్ర నగరం జెరూసలేం పీఠం కు బిషప్ గా సేవలు అందించారు. ప్రేమదాత్రుత్వాలకు పెట్టింది పేరుగా ఎల్లప్పుడు దేవాలయంకు వేద ప్రచారం కు అతుక్కు పోయి ఉండేవారు. యూదుల ఆచారాలంటే ఎక్కువ ఇష్టం. హేరోదు అగ్రిప్ప వేదహింసలు ప్రబలినపుడు తమ గొప్ప పదవికి న్యాయం చేయలేక పోతున్నందుకు గాను మవునముగా రాజీనామా చేశారు.

    పునీత యాకోబు గారు వ్రాసిన లేఖను వారు క్రీ.శ. 47 లో వ్రాసారు. ఈ లేఖ సిరియా శ్రీ సభను ఉద్దేశించి వ్రాసినట్లు అర్ధమౌతుంది. ఎందుకంటే, కొత్తగా వచ్చిన దైవ ప్రేమ, సహోదర ప్రేమ పునాది పై గల క్రైస్తవ వేదం అనుసరించడం వల్ల సమాజంలో తాము తక్కువగా చూడబడడం, అనగద్రొక్కబడడం అనుభవిస్తున్న క్రొత్త విశ్వాసుల కోసం వారిని ప్రోత్సహిస్తూ ఈ లేఖ వ్రాసారు.

    బట్టలు ఉతికే వారల సంఘం వారు ఆగ్రహం తో విరుచుకు పడి చిన్న యాకోబు గారిని దేవాలయంకు వున్న పిట్ట గోడపై నుండి బలం గా విసిరివేసి కొట్టి చంపారు. వారు క్రీ. శ. 62 లో వేద సాక్షి మరణం పొందారు. వీరు డ్రగ్గిస్ట్ లు, చాకలి వృత్తి వారు, దొర టోపీ తయారీ దార్ల పాలక పునీతులు.

    ధ్యానంశం: కేవలము వినుటయేనని ఆత్మ వంచన చేసికొనకుడు. దానిని ఆచరింపుడు. (యాకోబు. 1: 22)

    అపోస్తలుడైన పునీత ఫిలిప్పు: (వేదసాక్షి క్రీ.శ. – 80)

    గేన్నేసరేతు సరస్సుకు వొడ్డున గల బెత్సయిదా పుర నివాసి ఈ ఫిలిప్పు గారు. యేసు క్రీస్తు ప్రభుని 12 మంది తొలి అపోస్తులలో ఒకరు. అప్పటికి వారికి వివాహమైంది. చాలా మంది ఆడపిల్లల తండ్రి. ఎప్పటి నుండో వేద ప్రవచనం చొప్పున ఎదురు చూస్తున్న మెస్సియ కంటికగుపించి శిష్యుడు గా చేరిన వెంటనే, తన ఈ ఆనందాన్ని, పంచుకోవడానికి తన ఆప్త మిత్రుడైన నతనయేలు వద్దకు వెళ్లి “మోషే ధర్మశాస్త్రమందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును, నజరేతు నివాసియును అగు యేసు” అని చెప్పారు. “నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా?” అని నతనయేలు ప్రశ్నింపగా “వచ్చి చూడుము” అని జవాబుచెప్పింది ఫిలిప్పు గారే (యోహాను 1:45,46) నతనయేలు (బర్తలోమియో) గారు కూడా ఫిలిప్పు గారితో పాటు వెళ్లి యేసు నాధుని శిష్యులవడం మనకు తెలుసు.

    తియోడోరేత్ మరియు ఎవుసేబియస్ గార్లు గట్టిగా చెప్పేదేమంటే పెంతెకోస్తు దినాన పవిత్రాత్మను స్వీకరించిన పిమ్మట ఫిలిప్పు గారు కన్యకలుగా ఉన్న తన కుమార్తెలను వెంట నిడుకొని ఆసియా మైనరు (టర్కీ) ప్రాంతంలో సువార్తా ప్రచారం చేసి, ప్రిగియా ప్రాంతంలోని హీరాపోలిస్ ఊరిలో సిలువలో కొట్టబడి చంపబడ్డారు. బహుశా క్రీ.శ. 80లో కావచ్చు. వీరి గుర్తు రెండు రొట్టెలు ఫిలిప్పు అనగా అశ్వప్రియుడు, గుర్రముల అభిమాని అని అర్ధం.

    ధ్యానంశం: నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోట వంటి వాడు. అట్టి వాడు దొరికినచో నిధి దొరికినట్లే. (సిరా 6:14).
  • మరియమాత పూజిత మాసం 3వ రోజు

    May 02, 2024
    దేవమాత పుట్టుకను గూర్చి

    1. కన్యమరియమ్మగారు జన్మించిన దినమున
    పరలోకమందు పరమానందము గల్గెను.
    2. ఆమె జన్మదినమున భూలోకమునకు ఒక అభయము
    గల్గెను.
    3. ఆమె పుట్టుకతో నరకమున భయభ్రాంతులు చెలరేగినవి
  • పునీత అతనాసియస్ మే 2

    May 02, 2024
    వీరు 297 సం॥ ఈజిప్టు లోని గొప్ప క్రైస్తవ కుటుంబంలో జన్మించారు.

    గొప్ప ఆశయాలు కలిగి దైవ సేవ చేయాలనే ఆశకలిగి డీకను అయ్యారు.

    తన 31వ ఎట పీఠాధిపతిగా ఎన్నికై ఎరియనిజం నశింపచేయుటలో ముఖ్య పాత్ర పోషించి, తన 76వ ఎట వేదసాక్షి మరణం పొందారు.
  • మరియమాత పూజిత మాసం 1వ రోజు

    Apr 30, 2024
    మే నెలలో మనము దేవమాత పై విశేష భక్తి
    నుంచుటకు ముఖ్యమగు కారణములు 3
    కలవు.
    1. దేవమాత యొక్క గొప్పతనం 2.
    దేవమాత పై పునీతుల కుండిన భక్తి
    3. దేవమాత పై భక్తి వలన వచ్చు
    ప్రయోజనములు.
  • సువిశేషకుడు పునీత మార్కు ఉత్సవము ఏప్రిల్ 25

    Apr 25, 2024
    పునీత మార్కు (74) సువార్త రచయిత, వేదసాక్షి,క్రీస్తు ప్రభుని అనుచరుడు.

    పునీత పౌలు మరియు బర్నబాసుతో వేదప్రచారం
    చేశారు.
    వీరు కండ్లారా చూచిన, వినిన విశ్వసనీయ అంశాలన్నింటిని గ్రంధస్తం చేశారు.

    వీరి చిహ్నం రెక్కలున్న సింహం.

    మార్కు అనగ మానవత్వం అని అర్థం.
  • మరియ భర్తయగు పునీత యోసేపుగారి మహోత్సవం

    Mar 19, 2024
    మరియ భర్తయగు పునీత యోసేపుగారి మహోత్సవం

    యోసేపు’ అంటే ‘కలుపుకొను’ లేదా ‘దేవుడు సమృద్ది చేయును’ అని అర్ధం. యోసేపు కన్యమరియమ్మకు జ్ఞానభర్త, యేసుకు సాకుడుతండ్రి.
  • మరియమాత పూజిత మాసం 2వ రోజు

    May 01, 2024
    జన్మపాపములేక ఉద్భవించిన దేవమాత మహిమ
    1. కన్య మరియమ్మగారు పుట్టినపుడు ఆమెకివ్వబడిన దేవ వరప్రసాదములు .
    2. కన్య మరియమ్మ తనకు దేవుడనుగ్రహించిన వరములను అర్థము
    చేసుకొని జీవించుట .
    3. దేవుడు తనకిచ్చిన వరములను అతి జాగరూకతతో కాపాడుకొనుట .
  • కార్మిక యోసేపు పండుగ

    Apr 30, 2024
    కార్మిక భావనను క్రైస్తవీకరించడానికి 1955 సం॥లో 12వ భక్తినాధ పోపుగారిచే ప్రారంభించబడినది.

    తన జీవిత భాగస్వామి మరియకు, కుమారుడైన క్రీస్తుకు వారి యొక్క అవసరములను సమకూర్చుటలో యోసేపు ఆనందించారు,

    శ్రామికులందరకు యోసేపు గారు ఒక ఉదాహరణగా నిలిచారు