పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ | 4 అక్టోబర్

పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ | 4 అక్టోబర్

పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ | 4 అక్టోబర్ 

పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ (St. Francis of Assisi) 12వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప పునీతుడు. ఈయన మహోత్సవాన్ని (Feast Day) ప్రతి సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన ఘనంగా జరుపుకుంటారు. 

పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ (St. Francis of అస్సిసి) గారు ఇటలీ దేశంలోని అస్సీసి పట్టణంలో క్రీ.శ. 1182లో జన్మించారు. ఆయన తండ్రి పీటర్ బెర్నార్డ్ ఒక సంపన్న వస్త్ర వ్యాపారి,  తల్లి పేరు పీకా.మారుమనస్సు పొందక ముందు ఫ్రాన్సిస్‌, యోహాను (జాన్‌)గా పిలువబడినాడు.  

పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ గారు పేదవారి పట్ల అపారమైన ప్రేమ, సేవ మరియు స్నేహభావంతో జీవించారు.క్రీ.శ. 1220 లో ఆయన ఒక నూతన సన్యాస సభను (Franciscan Order) స్థాపించారు. తన అనుచరులను ఆయన "ఫ్రయర్స్ మైనర్" (Friars Minor) అని పిలిచారు.

పునీత ఫ్రాన్సిస్ పక్షులు, జంతువులు మరియు ప్రకృతిని దేవుని సృష్టిగా ఎంతో ప్రేమించేవారు. అందువల్ల ఆయనను జంతువులకు మరియు పర్యావరణానికి రక్షక పునీతునిగా (Patron Saint of Animals and Environment) పరిగణిస్తారు. 
ప్రకృతిలోని సమస్తములో దేవుని సాన్నిధ్యాన్ని చవిచూసాడు. సమస్తమును తన సహోదరీ, సహోదరులుగా పిలిచాడు. ప్రకృతి పట్ల, అతనికున్న ప్రేమ వలన, ఈ తరము వారు కూడా ప్రకృతి పట్ల ప్రేమను, దాని నాశనమును కోరుకొనక అభివృద్ధిని కోరుకొనేట్టు ప్రేరేపింప బడాలని ఆశిద్దాం.

Article and design by M kranthi Swaroop

Telugu Survey Popup Image