పరిశుద్ధ జపమాల మాత పండుగ
పరిశుద్ధ జపమాల మాత పండుగ (7 అక్టోబరు)
క్రీస్తు శకం 1571లో తురుష్కులు క్రైస్తవ దేశాలపై దండెత్తి వచ్చినప్పుడు యావన్మంది క్రైస్తవులు మరియతల్లి యొక్క మధ్యవర్తిత్వాన్ని వేడుకుంటూ ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనకు ఫలితంగా క్రైస్తవుల చేతిలో తురుష్కులు ఓటమి పాలు చెందారు. ఈ విజయానికి గుర్తుగా మన తల్లి శ్రీసభ అప్పటి పోప్గార్ల ఆమోదంతో ఈ పండుగను కొనియాడుతూ వస్తున్నది. మొదట ఈ పండుగ కొన్ని ప్రదేశాలకు మాత్రమే పరిమితం చెందినది తరువాత శ్రీసభ దీనిని విశ్వవ్యాప్తం చెందినది.
మొదట దీనిని "విజయ మాత పండుగ"గా పిలిచేవారు. ఆ తర్వాత పోప్ పదమూడవ గ్రెగోరీ దీనిని "జపమాల మాత పండుగ"గా మార్చారు. అక్టోబర్ నెలను మొత్తం [జపమాల మాసంగా] పోషకురాలైన మరియమాత ధ్యానంలో గడుపుతారు. జపమాల ప్రార్థన ద్వారా దేవుని శాంతి, ఓదార్పు లభిస్తాయని విశ్వసిస్తారు.
జపమాల అంటే అర్థం జపముతో కూడిన మా అని అర్థం. ఇక్కడ జపము అంటే ప్రార్థన అని అర్థం. క్రీస్తు శకం 13వ శతాబ్ద ఆరంభంలో మరియతల్లి తన యొక్క స్వహస్తాల ద్వారా పునీత దోమినిక్ గారికి జపమాలను ఇచ్చి జపమాల ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఆయనకు చెప్పి ఉన్నారు.
మే మాసమునకు, అక్టోబర్ మాసమునకు మన శ్రీసభలో ప్రత్యేక విశిష్టత ఉన్నది. ఎందుకంటే, ఈ రెండు నెలలు కూడా మనము మరియతల్లికి అంకితం చేస్తూ మన యొక్క ప్రార్ధనా అవసరతను తన యొక్క ప్రియ కుమారునికి మనవి చేయమని ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనను అర్థిస్తూ ఉంటాము. ఈసందర్భంగా పండుగ యొక్క చరిత్రను, మరియతల్లి మనందరికీ ఇచ్చిన జపమాల ప్రార్థన యొక్క ఔన్నత్యాన్ని గూర్చి ధ్యానం చేద్దాం.
Source - Fr praveen Gopu
Article and Design BY M Kranthi Swaroop
