2027 ప్రపంచ వేదవ్యాపక దినోత్సవ నేపధ్యాన్ని ప్రకటించిన పోప్
101వ ప్రపంచ వేదవ్యాపక ఆదివారం 2027 అక్టోబర్ 24 నాడు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా పోప్ లియో “క్రీస్తు ప్రేమ మనలను సేవా కార్యానికి ప్రోత్సహిస్తుంది ” అనే నినాదాన్ని ఎంపిక చేశారు.
సువార్త ప్రచారం చేయడం, ప్రతి ఒక్కరినీ సోదరభావంతో ఆదరించడం అనే వేదవ్యాపకం యొక్క ప్రధాన లక్ష్యాన్ని ఈ నినాథం తెలియజేస్తుందని సువార్త ప్రచారానికి సంబంధించిన వాటికన్ విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది.
2026 ప్రపంచ వేదవ్యాపక ఆదివారం సందేశంలో పోప్ లియో మాట్లాడుతూ, “ఐక్యత అనేది వేదవ్యాప్తికి పునాది అయితే, ప్రేమ అనేది దాని సారాంశం” అని గుర్తుచేశారు.
యేసుక్రీస్తు ద్వారా వెల్లడైన దేవుని ప్రేమ నుంచే తిరుసభ మిషన్ ఆవిర్భవిస్తుందని ఆ ప్రకటన వివరించింది.
క్రీస్తు ప్రేమ మనలను మన స్వార్థాన్ని అధిగమించి, ఒంటరిగా ఉన్నవారిని, పేదలను, బాధల్లో ఉన్నవారిని చేరుకుని వారికి సహాయం చేయడానికి ప్రేరేపిస్తుంది.
2027 ప్రపంచ వేదవ్యాపక ఆదివారం ప్రత్యేక సందేశాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయనున్నారు.
పోప్ లియో ఎంపిక చేసిన ఈ నినాథం పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ నుంచి తీసుకోబడింది.
