అమృతవాణి మరియు RVA బృందం బైబిల్ క్విజ్ పోటీలు నిర్వహించారు

అమృతవాణి మరియు RVA బృందం బైబిల్ క్విజ్ పోటీలు నిర్వహించారు

కర్నూలు మాత్రాసనం లో జరిగింది మూడు రోజుల యువత కెరియర్ మార్గదర్శక లో అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు(RVA) బృందం బైబిల్ క్విజ్ పోటీలు నిర్వహించారు. లూకా సువార్త పై నిర్వహించిన ఈ బైబిల్ క్విజ్ పోటీల్లో పిల్లల కోసం 100 కు పైగా బైబిల్ ప్రశ్నలను RVA బృందం సిద్దము చేసింది.

ఈ బైబిల్ క్విజ్ పోటీ పిల్లలలో అవగాహన స్థాయిని పెంచడమే కాకుండా, క్రమపద్ధతిగా బైబిల్ చదివే అలవాటును మరింత బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఐదు జట్లు పాల్గొనగా కర్నూల్ డినరీ విజయం సాధించింది. ఆదోని డినరీ రెండవ స్థానం లో నిలిచింది. అనంతపూర్ డినరీ మూడవ స్థానంలో నిలిచింది .

కర్నూలు మేత్రాసన పీఠాధిపతులు మహా పూజ్య జోహన్నెస్ గొరంట్ల గారు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ పప్పుల సుధాకర్ మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు సిబ్బంది పాల్గొన్నారు. బ్రదర్ పవన్ తన సహాయ సహకారాలను అందించారు .

 

Article and Design by M Kranthi Swaroop

Telugu Survey Popup Image