జీసస్ యూత్‌కు వాటికన్ నుంచి చారిత్రాత్మక ఆమోదం!

జీసస్ యూత్‌కు వాటికన్ నుంచి చారిత్రాత్మక ఆమోదం!

జీసస్ యూత్‌కు వాటికన్ నుంచి చారిత్రాత్మక ఆమోదం! 

రోమ్: ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ యువతలో విశ్వాసం, ప్రార్థన, సువార్త ప్రచారం, సేవా దృక్పథాన్ని ప్రోత్సహిస్తున్న జీసస్ యూత్ అంతర్జాతీయ ఉద్యమానికి వాటికన్ నుంచి కీలక ఆమోదం లభించినట్లు సమాచారం.

వాటికన్‌లోని లేటీ, ఫ్యామిలీ అండ్ లైఫ్ డికాస్టరీ (Dicastery for Laity, Family and Life), జీసస్ యూత్‌కు చట్టపరమైన వ్యక్తిత్వం కలిగిన విశ్వాసుల అంతర్జాతీయ ప్రైవేట్ సంఘంగా లభించిన గుర్తింపును ధృవీకరించింది. ఈ నిర్ణయం ఉద్యమానికి శ్రీసభ చట్టం ప్రకారం ఉన్న అంతర్జాతీయ గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది. 

రోమ్‌లో "గో కాన్ఫరెన్స్ 2026" (GO Conference 2026):

 ఇటలీలోని రోమ్ నగరంలో  అక్టోబర్ 20,2026 నుండి 25,2026 వరకు  "గో కాన్ఫరెన్స్ 2026"చారిత్రాత్మక సదస్సు ఘనంగా జరుగుతోంది. జీసస్ యూత్ ఉద్యమం ప్రారంభమై 40 సంవత్సరాలు (రూబీ జూబ్లీ) పూర్తయిన సందర్భంగా, అలాగే వాటికన్/హోలీ సీ నుండి దీనికి అధికారిక పొంటిఫికల్ గుర్తింపు లభించి 10 సంవత్సరాలు అయినందుకు గాను ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు

 అధికసంఖ్యలో పీఠాధిపతులు, ఫాదర్ లు  (Priests) మరియు 41 దేశాల నుండి దాదాపు 1,100 మందికి పైగా జీసస్ యూత్ సభ్యులు,ఇందులో పాల్గొన్నారు. బైబిల్‌లోని అపొస్తలుల కార్యములు 1:8 ఆధారంగా "Go to the Ends of the Earth" (భూదిగంతముల వరకు వెళ్ళండి) అనే నినాదంతో ఈ సదస్సు సాగుతోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జీసస్ యూత్ తెలుగు రీజియన్ సభ్యులు కూడా ఈ అంతర్జాతీయ రోమ్ సదస్సులో పాల్గొని తెలుగు ప్రాంత ప్రతినిధులుగా హాజరయ్యారు.

జీసస్ యూత్ ఉద్యమం యువతను క్రీస్తు బోధనలకు అనుగుణంగా జీవించేందుకు ప్రోత్సహిస్తూ, వారి ఆధ్యాత్మిక ఎదుగుదలతో పాటు సమాజ సేవలోనూ చురుకైన పాత్ర పోషించేలా మార్గనిర్దేశం చేస్తోంది. ప్రార్థన, దేవుని వాక్యం, దివ్య సంస్కారాలు, సహవాసం, సువార్త ప్రచారం, పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ వంటి ఆరు ముఖ్య అంశాలు ఈ ఉద్యమ ఆధ్యాత్మిక జీవితానికి పునాదులుగా ఉన్నాయి.

ప్రపంచంలోని వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీసస్ యూత్, యువతలో క్రైస్తవ విలువలను పెంపొందించడం, విశ్వాస జీవితాన్ని బలోపేతం చేయడం, అవసరంలో ఉన్నవారికి సేవ చేయడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది.

Article and Design By M Kranthi Swaroop

Telugu Survey Popup Image