ధైర్యం తెచ్చుకోండి!
ధైర్యం తెచ్చుకోండి! ఘనంగా WITNESS 2026 (National Youth Convention)
భారతదేశ వ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ యువత కోసం నిర్వహించబడిన WITNESS 2026 (జాతీయ సదస్సు) ఘనంగా జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ క్యాథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా (CCBI) యూత్ కమిషన్, ఇండియన్ క్యాథలిక్ యూత్ మూవ్మెంట్ (ICYM) ఆధ్వర్యంలో అక్టోబర్ 13 నుండి 16, 2026వరకు బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం జరిగింది.
"ధైర్యము వహింపుడు. నేను లోకమును జయించితిని” (యోహాను 16:33) అనే దేవుని మాటల స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశం నేటి ప్రపంచంలో మన ప్రభువైన యేసు క్రీస్తుకు ధైర్యవంతులైన సాక్షులుగా మారడానికి యువతకు పిలుపునివ్వబడింది.
ఈ కార్యక్రమంలో బరేలీ పీఠాధిపతులు మరియు CCBI యూత్ కమిషన్ చైర్మన్ మహా పూజ్య డా. ఇగ్నేషియస్ డిసౌజా (Most Rev. Dr. Ignatius D'Souza) గారు ఈ జాతీయ సదస్సు (WITNESS 2026) నిర్వహణలో ఈయన ప్రధాన పాత్ర పోషించారు మరియు యువతకు ప్రత్యేక సందేశాన్ని అందించారు.
రెవ. ఫాదర్ జాన్ బార్మన్ MSFS (Rev. Fr. John Barman MSFS)గారు ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువతీ యువకులను, ప్రతినిధులను ఆహ్వానించి, కార్యక్రమ సమన్వయంలో ప్రధాన బాధ్యతను నిర్వర్తించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అధికసంఖ్యలో యువత పాల్గొన్నారు. భారతదేశంలోని ప్రాంతీయ రీజినల్ డైరెక్టర్లు, ఫాదర్స్ మరియు సిస్టర్స్ తమ ప్రాంత యువతకు నాయకత్వం వహించి ఈ సదస్సులోభాగస్వామ్యులయ్యారు. యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి నాయకత్వ లక్షణాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమములు నిర్వహించారు. పవిత్ర బలిపూజ , ఆరాధన, ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Article and Design by M Kranthi Swaroop
