విశాఖ అగ్రపీఠాధిపతికి 'పాలియం' ప్రదానం

విశాఖ అగ్రపీఠాధిపతికి 'పాలియం' ప్రదానం  
జూన్ 29, 2025 ఆదివారం ఉదయం రోమ్ లోని సెయింట్ పీటర్స్ దేవాలయంలో 
సెయింట్స్ పీటర్ మరియు పాల్ ల మహోత్సవము ఘనంగా జరిగింది. పరిశుద్ధ పోప్ లియో XIV గారు ఈ ప్రార్థనా సమయంలో, భారతదేశం నుండి ముగ్గురు పీఠాధిపతులు సహా ప్రపంచవ్యాప్తంగా 54 మంది కొత్తగా నియమితులైన "మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్‌"లను  ఆశీర్వదించి, వారికి పాలియం(Pallium)లను ప్రదానం చేసారు . 
 దక్షిణ భారతదేశం తరఫున విశాఖ అగ్ర పీఠాధిపతి మహా పూజ్య బాలశౌరి గారు ఈ వేడుకలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా పరిశుద్ధ పోప్ లియో XIV, గారి చేతుల మీదుగా మహా పూజ్య బాలశౌరి గారికి పాలియంను బహూకరించారు.  భారతదేశం నుంచి ముగ్గురు అగ్రపీఠాధిపతులకు ఈ గౌరవం లభించింది. పాలియం అందుకున్న భారతీయ పీఠాధిపతులలో బొంబాయి మెట్రోపాలిటన్ అగ్ర పీఠాధిపతి  మహా పూజ్య  జాన్ రోడ్రిగ్స్ గారు, కాలికట్ మెట్రోపాలిటన్ అగ్ర పీఠాధిపతి  మహా పూజ్య వర్గీస్ చక్కలకల్ గారు , మరియు విశాఖపట్నం మెట్రోపాలిటన్ అగ్ర పీఠాధిపతి మహా పూజ్య ఉడుమల బాల గారు ఉన్నారు. 
పాలియం అనేది తెల్లని గొర్రె ఉన్నితో తయారు చేసిన దైవార్చన వస్త్రం. మహోత్స వాల్లో నిర్వహించే పరిశుద్ధ దివ్య బలి పూజల్లో వీటిని అగ్రపీఠాధిపతులు ధరిస్తారు. ఇది మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ యొక్క అధికారిక చిహ్నంగా పనిచేస్తుంది.

Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer

 

Telugu Survey Popup Image