గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా శ్రీ వైయస్ జగన్ ను కలిసి ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు
గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా శ్రీ వైయస్ జగన్ ను కలిసి ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు
గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.
గుడ్ ఫ్రైడే త్యాగానికి, ప్రేమకు ప్రతీకగా నిలిచిన పవిత్ర దినమని, ఈస్టర్ పర్వదినం ఆశ, పునర్జన్మ, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని శ్రీ వైయస్ జగన్ గారు అన్నారు. సమాజంలో ప్రేమ, సహనం, పరస్పర గౌరవం పెంపొందాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రంలోని క్రైస్తవ సోదర సోదరీమణులకు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబం ఆనందంతో, ఆరోగ్యంతో, సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు క్రైస్తవ మత పెద్దలు శ్రీ జాన్ వెస్లీ, వైఎస్సార్సీపీ క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్, ఆర్చ్ బిషప్ ఎన్ఎఎస్టి రాజు గారు ,బిషప్ సంజీవరావు , బిషప్ సైమన్ సీజర్ , ఏసురత్నం , బిషప్ అనిల్ ఇతరులు పాల్గొన్నారు.
Article and design by M Kranthi Swaroop