పోప్ లియో XIV ఫ్రాన్స్‌కు తన అపోస్తలిక యాత్రకు బయలుదేరారు
పోప్ లియో XIV ఫ్రాన్స్‌కు తన అపోస్తలిక యాత్రకు బయలుదేరారు
పరిశుద్ధ లియో XIV పాపు గారు తన నాలుగు రోజుల ఫ్రాన్స్ అపోస్తలిక యాత్రకు ఈరోజు, సెప్టెంబర్ 25న రోమ్ నుంచి బయలుదేరారు. శుక్రవారం నాడు పాత్రికేయులు మరియు తన పరివారంతో కలిసి రోమ్‌లోని ఫియుమిసినో విమానాశ్రయంలో పోప్ విమానం ఎక్కారు.
పరిశుద్ధ లియో XIV పాపు గారు ప్రత్యేక విమానంలో పారిస్‌కు ప్రయాణిస్తున్నారు. ITA ఎయిర్వేస్ A321 విమానం రోమ్ కాలమానం ప్రకారం ఉదయం 7:58 గంటలకు బయలుదేరి, ఉదయం 10:00 గంటలకు పారిస్ ఓర్లీ విమానాశ్రయంలో దిగనుంది.
సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు కొనసాగనున్న ఈ యాత్రలో పరిశుద్ధ లియో XIV పాపు గారు పారిస్, లూర్ద్ మరియు మెట్జ్ నగరాలను సందర్శించనున్నారు.
ఫ్రాన్స్ చేరుకున్న అనంతరం పోప్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కలుసుకుని, రాజకీయ నాయకులు, పౌర సమాజ ప్రతినిధులు, దౌత్యవేత్తలతో సమావేశం కానున్నారు. అనంతరం యునెస్కో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ప్రసంగిస్తారు.
ఈ యాత్రలో ప్రత్యేకంగా లూర్ద్ సందర్శనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అక్కడ పరిశుద్ధ లియో XIV పాపు గారు "అవర్ లేడీ ఆఫ్ లూర్ద్" గుహ వద్ద ప్రార్థించి, సెప్టెంబర్ 27న పవిత్ర బలిపూజను నిర్వహిస్తారు. అనారోగ్యంతో ఉన్నవారిని, బాధితులను కూడా ఆయన కలుసుకోనున్నారు.
పరిశుద్ధ లియో XIV పాపు గారు యాత్ర చివరి రోజైన సోమవారం, ఈశాన్య నగరమైన మెట్జ్‌లో గడపనున్నారు.మెట్జ్‌లో ఒక అంతర్-మత సమావేశంలో పాల్గొని, యూరప్‌లో శాంతి మరియు ఐక్యత కోసం సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం సెయింట్ స్టీఫెన్ కేథడ్రల్‌లో పవిత్ర దివ్య బలిపూజను నిర్వహించి రోమ్కు తిరిగి బయలుదేరుతారు.
Article And Design By M Kranthi Swaroop
