ఘనంగా TMG2026

ఘనంగా TMG2026

ఘనంగా TMG2026

జీసస్ యూత్ టీన్స్ మినిస్ట్రీ ఇండియా ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు టీన్ మినిస్ట్రీ సమావేశం  (TMG 2026) ఘనంగా జరిగింది.

బెంగళూరులోని సెయింట్ ఫ్రాన్సిస్ ఇన్‌స్టిట్యూషన్స్, కొరమంగళ లో  అక్టోబర్ 1  నుంచి 4 వరకు నిర్వహించిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా టీనేజర్లు, టీన్స్ మినిస్టర్లు, విశ్వాస మార్గదర్శకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. యువతలో విశ్వాసాన్ని బలోపేతం చేయడం, ఆధ్యాత్మిక వికాసాన్ని ప్రోత్సహించడం, మన ప్రభువైన యేసు క్రీస్తుతో తమ సంబంధాన్ని మరింతగా పెంపొందించుకోవడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. 

దేశంలోని వివిధ  ప్రాంతాల నుంచి జీసస్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో  ప్రార్థన, ఆరాధన గీతాలు,  సంగీత ప్రదర్శనలు, నాటకాలు, ప్రతిభా ప్రదర్శనలు, చిన్న బృందాల్లో అనుభవాల పంచుకోవడం, విశ్వాస వికాస సమావేశాలు నిర్వహించారు. 

Article and Design by M Kranthi Swaroop

 

Telugu Survey Popup Image