ఆదివారం రోజు ఏంజెలస్ వద్ద ప్రార్థనలలో భాగంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతూ ప్రార్థనలో సమయాన్ని వెచ్చించడం మరియు మరింత శ్రద్ధగా మరియు దయతో ఉండాలని చెప్పారు, మనం రోజువారీ చింతల నుండి ఉపశమనాన్ని పొందాలని అన్నారు.
విశాఖ అతిమేత్రాసనం యర్ర సామంతవలస విచారణ, క్రీస్తురాజు పుణ్య క్షేత్రంలో " ఒక్క రోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన" భక్తియుతంగా జరిగింది. ఆదివారం రాత్రి క్రీస్తు రాజు పురం లోని పనసబద్ర నూతన దేవాలయం లో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు జరిగింది.
విశాఖ అతిమేత్రాసనం సెయింట్ ఆన్స్ కో కథెడ్రల్ విచారణ, పునీత అన్నమ్మగారి మహోత్సవ నవదిన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. విచారణ కర్తలు గురుశ్రీ మరియారత్నం గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.