" ఒక్క రోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన"
" ఒక్క రోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన"
విశాఖ అతిమేత్రాసనం యర్ర సామంతవలస విచారణ, క్రీస్తురాజు పుణ్య క్షేత్రంలో " ఒక్క రోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన" నిర్వహించనున్నారు.
ఈ రాత్రి జాగరణ ప్రార్థన రేపు రాత్రి (ఆదివారం) అనగా "2024, జులై 21 న క్రీస్తు రాజు పురం
( పనసబద్ర) నూతన దేవాలయం లో జరుగును. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు జరగనున్నది.
విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, యర్ర సామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం జరగనున్నది.
గురుశ్రీ పి జీవన్ బాబు గారు మాట్లాడుతూ "ప్రియ దేవుని బిడ్డలారా! దైవ ప్రేరణ వలన, మన ప్రపంచం కోసం, మనకు అసాధ్యమవుతున్న మన సమస్యల పరిష్కారం, విడుదల కొరకు ప్రార్డించబోతున్నాము . కొండ కొనలు, ప్రకృతి ఒడిలో వెలసిన ఈ క్రీస్తురాజు పుణ్య క్షేత్రంలో, అనేక మందికి స్వస్తతలు, దీవెనలు, విడుదలలు, సంతాన భాగ్యం, ఉద్యోగ భాగ్యం , కుటుంబాలలో శాంతి, సమాధానాలు కలుగుతున్నాయి అని, శ్రీ శ్రీ శ్రీ క్రీస్తురాజు పుణ్య క్షేత్రం లో జరగనున్న ఈ " ఒక్క రోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థనలో అందరు పాల్గొనాలని కోరారు.
రాత్రి జాగరణ ప్రార్థనలో గురుశ్రీ శరగడం బాల శౌరి గారు , గురుశ్రీ అలమండ సంతోష్ గారు ,ఇతర గురువులు పాల్గొననున్నారు.
కార్యక్రమములు:
రాత్రి 9:00 జపమాల, దివ్య పూజా బలి
11:00 వాక్య పరిచర్య గురుశ్రీ శరగడం బాల శౌరి.
(గుడిలో, పాప సంకీర్తనలు)- పూజ్య గురువులు
12:00 - స్తుతి ఆరాధన, వాక్య పరిచర్య- గురుశ్రీ అలమండ సంతోష్
1:00 - టీ విరామం
1:15 - పరిశుద్ద సిలువ మార్గం ధ్యానం
2:00 - దివ్య సత్ప్రసాద ప్రదక్షిణ,( క్రొవ్వొత్తులతో) దివ్య సత్ప్రసాద మహా ఆరాధన.
3:00 తైల అభిషేక స్వస్థత ప్రార్దనలు - గురు శ్రీ పి జీవన్ బాబు
4:00 దివ్య పూజా బలి - గురువులచే
5:00 సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించడం.
స్వస్థత ప్రార్ధన, వివిధ అవసరాలకై ప్రత్యేక ప్రార్దనలు కోసం మీ కుటుంబాలతో తరలి రండి అని ప్రేమతో పిలుస్తున్నారు మన ప్రియతమ గురువులు గురుశ్రీ పి జీవన్ బాబు గారు .
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer