ప్రార్థనతోనే దైవ సేవ సాధ్యం: పాకిస్తాన్‌ ఆర్చ్‌బిషప్ దివ్య సందేశం

ప్రార్థనతోనే దైవ సేవ సాధ్యం: పాకిస్తాన్‌ ఆర్చ్‌బిషప్ దివ్య సందేశం 

పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి చాంబెరీకి చెందిన సిస్టర్స్ ఆఫ్ సెయింట్ జోసెఫ్ (CSJ) కాంగ్రిగేషన్‌కు చెందిన డజనుకు పైగా ప్రతినిధులు జూలై 26 నుంచి ఆగస్టు 5 వరకు అని లాహోర్‌లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్‌లో జరిగిన వార్షిక ప్రాంతీయ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో వారు ప్రార్థనా జీవితాన్ని మరింత లోతుగా జీవించేందుకు, సినోడల్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు, అలాగే శ్రీసభ సేవ పట్ల తమ అంకితభావాన్ని పునరుద్ధరించేందుకు ప్రతిజ్ఞ చేశారు. 

"మీ వైఖరి యేసు క్రీస్తు వైఖరి వలె ఉండాలి" అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ వార్షిక సమావేశంలో, లాహోర్, ముల్తాన్, క్వెట్టా తదితర ప్రాంతాల్లో సేవలందిస్తున్న సిస్టర్స్ ఆఫ్ సెయింట్ జోసెఫ్ (CSJ) సిస్టర్స్  పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఆగస్టు 3న లాహోర్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య  ఖాలిద్ రెహ్మత్ గారి అధ్యక్షతన జరిగిన దివ్యబలి పూజ  ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన సిస్టర్స్ లను ప్రార్థనా జీవితాన్ని మరింతగా లోతుగా పెంపొందించుకోవాలని, ప్రార్థనే బలమని, ప్రార్థనతోనే సేవకు శక్తి అని ,అలాగే తమ పరిచర్యల ద్వారా సువార్తకు విశ్వసనీయ సాక్షులుగా నిలవాలని ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సమన్వయకర్త అయిన సిస్టర్ షకీలా భట్టి, CSJ, మూల్యాంకన సమావేశాలకు నాయకత్వం వహించి, కరుణామయ నాయకత్వానికి, ఆరోగ్యకరమైన సామాజిక జీవితానికి మరియు సమర్థవంతమైన ఆధ్యాత్మిక సేవకు వినడం, అర్థం చేసుకోవడం అత్యంత అవసరమని  చెప్పారు.

ఆగస్టు 5న నిర్వహించిన కృతజ్ఞతా దినోత్సవంతో ఈ వార్షిక సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఐదు గంటలపాటు నిశ్శబ్ద దివ్య సత్ప్రసాద ఆరాధన నిర్వహించడంతో పాటు, ప్రత్యేక ముగింపు ప్రార్థన కార్యక్రమం కూడా జరిగింది.

చివరిగా క్రీస్తు ప్రేమను సేవ ద్వారా ప్రజలకు చేరవేస్తూ, తమ మిషన్‌ను మరింత అంకితభావంతో కొనసాగించాలని   సిస్టర్ షకీలా భట్టి, CSJ, గారు  పిలుపునిచ్చారు.

Article and Design by M kranthi Swaroop

Telugu Survey Popup Image