నెల్లూరు మేత్రాసనము,మిరియంపల్లి గ్రామము త్రిపురాంతకం విచారణలో తేదీ 29 మే నెల మంగళవారము దేవాలయ రజిత జూబ్లీ వేడుకలు అట్టహాసముగా జరిగినవి.
25 వసంతాల క్రితం దేవాలయం నిర్మించినటువంటి గురుశ్రీ డేన్నిస్ డిసోజా గారు దివ్య పూజా బలిని సమర్పించి దేవుని యొక్క వాక్యాన్ని వివరించారు. 25 ఏళ్ల క్రితం ఏ విధముగా ఈ యొక్క మిరియంపల్లి గ్రామము దేవునిలో మమేకమై జ్ఞాన స్నానము తీసుకొని ఉన్నారో ఈనాటికి ఏ విధముగా అభివృద్ధి చెందియున్నదో ఆయన వివరించి అభినందించారు.ఈ వేడుకకు జ్ఞాపకార్థముగా సహాయమాత గృహను ప్రారంభించియున్నారు.
దివ్యబలి పూజ అనంతరము గురువులకు సన్మానం చేసియున్నారు ఈ యొక్క వేడుకలో పాల్గొన్నటువంటి గురుశ్రీ సునీల్ కుమార్, HGN ఎర్రగొండపాలెం విచారణ కర్తలు,
గురుశ్రీ షడ్రక్ మరియాపురం విచారణ కర్తలు, మరియు గురుశ్రీ మాదాను సందీప్ గారు MSFS,
త్రిపురాంతకం విచారణ సహాయక గురువులు పాల్గొని యున్నారు.
ఈ వేడుకకు 18 గ్రామాల నుంచి ఉపదేశులు మరియు విశ్వాసులు తండోపతండాలుగా వచ్చి దేవుని యొక్క దీవెనలు పొందియున్నారు.
ఈ వేడుకకు జ్ఞాపికగా గురువులకు వెండి గొలుసులను ఇచ్చియున్నారు. వచ్చినటువంటి గురువులకు, విశ్వాసులకు దివ్య పూజ అనంతరము ప్రేమ విందును ఏర్పాటు చేసారు. వచ్చిన వారందరికీ మరియు గ్రామ ఉపదేశులకు, గుడి పెద్దలకు విచారణ గురువులు గురుశ్రీ బండి సాగర్ సంతోష్ MSFS గారు సన్మానించి అభినందించి, కృతజ్ఞతలు తెలియచేసారు.
గుడి ఉపదేశి అయినటువంటి వేదమని గారిని, గుడి పెద్దలైనటువంటి ఆనంద్, శేఖర్, చిన్న కోటేష్, మరియు రాజారావులను విచారణ గురువులు మరియు సహాయక గురువులు సన్మానించారు.
ఈ వేడుకకు సహకరించినటువంటి విశ్వాసులను మరియు స్త్రీలకు మరియు ప్రతి ఒక్కరిని కూడాను విచారణ గరువులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
సాయంకాలము ఆరు గంటల 30 నిమిషములకు యేసు తిరు హృదయ స్వరూపముతో పురవీధులలో ప్రదక్షణ గావించియున్నారు. అనంతరము అందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేసిన తదుపరి, చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఉన్నారు.
చివరి ప్రార్థనతో మరియు బాణసంచా కాల్పులతో ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవముగా ఆకాశాన్ని అంటే విధముగా చక్కగా జరిగినందుకు దేవునికి కృతజ్ఞతలు అర్పించుకొనియున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, మరియు త్రిపురాంతకం విస్తరణ యువతి యువకులకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపియున్నారు.
ఈ యొక్క కార్యక్రమమునకు జ్ఞాపికగా దేవాలయమును దాదాపు 3 లక్షల రూపాయలతో బాగు చేసుకుని వారి కృతజ్ఞతా భావాన్ని చాటియున్నారు.