ఏప్రిల్ 19,2024న బంగ్లాదేశ్, ఢాకా, బనానీలో హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీ 50వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని జరుపుకుంది.
"స్థానిక శ్రీసభ నిర్మించడంలో 50 ఏళ్ళ కీర్తి." అనే నేపథ్యంపై జూబ్లీ వేడుక జరిగింది.
బంగ్లాదేశ్‌లోని పాపు గారి రాయబారి మహా పూజ్య కెవిన్ రాండాల్ గారు, 8 మంది ఇతర పీఠాధిపతులు,250 మంది గురువులు, 600 మందికి పైగా కథోలిక విశ్వాసులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఢాకా అగ్రపీఠాధిపతులు మహా పూజ్య బెజోయ్ యెన్ డి' క్రూజ్ OMI గారు గౌరవ అతిథిగా ఈ వేడుకను అలంకరించగా,బారిసాల్ పీఠాధిపతులు,ఎపిస్కోపల్ కమీషన్ అధ్యక్షులు మహా పూజ్య ఇమ్మాన్యుయేల్ కె. రోజారియో గారు దివ్యబలి పూజను సమర్పించారు.
"హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీ బంగ్లాదేశ్ కు దైవిక బహుమతి"అని కార్డినల్ పాట్రిక్ డి'రొజారియో గారు కొనియాడారు.
హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీ ఆగష్టు 23, 1973న స్థాపించబడింది మరియు మహా పూజ్య ఎడ్వర్డ్ కాసిడీ గారిచే లాంఛనప్రాయంగా ప్రారంభించబడింది.
ఐదు దశాబ్దాలుగా ఈ గురువిద్యాలయం 987 మంది విద్యార్థులకు విద్యను అందించింది, 9 మంది పీఠాధిపతులతో సహా 445 మంది గురువులను నియమించింది మరియు 83 మంది బ్రదర్ లను , 11 మంది మఠకన్యలను మరియు సామాన్యులకు తన విశిష్ట కార్యక్రమాల ద్వారా సేవనందించింది.మొత్తం 103 మంది ఉపాధ్యాయులు ఈ ప్రయత్నానికి ప్రత్యక్షంగా సహకరించారు.