ఏప్రిల్ 28 నుండి మే 2 వరకు వాటికన్‌లో జరిగే ప్రపంచవ్యాప్త విచారణ గురువుల సమావేశంలో పాల్గొనేందుకు ముగ్గురు ఫిలిపినో గురువులు ఎంపికయ్యారు.
1 .మొన్సిగ్నోర్ జోయెల్ బ్రూనో బారుట్, వికార్ జనరల్-లావోగ్ మేత్రాసనం,
టీమ్ మినిస్ట్రీ మోడరేటర్, లావోగ్ సిటీలోని సెయింట్ విలియం ది హెర్మిట్ కేథడ్రల్
2 .మొన్సిగ్నోర్ మార్నిటో బన్సిగ్, ఎపిస్కోపల్ వికార్, మాసిన్ మేత్రాసనం,వికార్ ఫోరేన్, ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ వికారియేట్,విచారణ గురువులు, బాటో, లేటేలోని హోలీ చైల్డ్ విచారణ
3 .మొన్సిగ్నోర్ జూలియస్ రోడుల్ఫా,వికార్ జనరల్, ఎపిస్కోపల్ వికార్ మరియు దావో అగ్రపీఠ పాస్టరల్ డైరెక్టర్,దవావో నగరంలోని శాన్ పెడ్రో కేథడ్రల్ విచారణ, పార్శియల్ వికార్ లు ఎన్నికయ్యారని ఫిలిప్పీన్స్‌లోని కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (CBCP) సెక్రటరీ-జనరల్
మొన్సిగ్నోర్ బెర్నార్డో పాంటిన్వా గారు తెలిపారు
ఫిలిప్పీన్ ప్రతినిధి బృందం కోసం దేశంలోని ప్రధాన దీవుల్లోని లుజోన్, విసయాస్ మరియు మిండనావో నుండి ఒక గురువుని ఎంపిక చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు పాంటిన్ తెలిపారు.
విచారణ గురువుల సినడ్ సమావేశాలు ఏప్రిల్ 28 నుండి మే 2 వరకు రోమ్ సమీపంలోని సాక్రోఫానోలోని ఫ్రటెర్నా డోమస్‌లో జరుగుతుంది, దాదాపు 300 మంది హాజరయ్యే అవకాశం ఉంది.
సమావేశం యొక్క చివరి రోజున, పోప్ ఫ్రాన్సిస్ పాల్గొనేవారితో వ్యక్తిగతంగా సమావేశమవుతారు.
ఈ ప్రపంచవ్యాప్త సమావేశం యొక్క ఫలితాలు ఈ అక్టోబర్‌లో జరిగే సినడల్ అసెంబ్లీ రెండవ సెషన్‌కు సంబంధించిన వర్కింగ్ డాక్యుమెంట్ అయిన ఇన్‌స్ట్రుమెంటమ్ లాబోరిస్‌ను రూపొందించడానికి ఉపయోగించబడతాయి.