ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అన్ని మేత్రాసనలోని ప్రతి విచారణ యందు, గ్రామాలయందు, జ్యోతిర్మయి ఆదివారాన్ని28 జనవరి 2024న కొనియాడాలని జ్యోతిర్మయి అధ్యక్షులు మహాఘన మల్లవరపు ప్రకాష్ గారు విశాఖ అగ్రపీఠాధిపతులు మరియు మహాఘన తలగతోటి జోసెఫ్ రాజారావు జ్యోతిర్మయి ఉపాధ్యక్షులు పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మరియగిరిమాత మహోత్సవాలు ఈ ఏడాది నుంచి 9 రోజులు జరగుతున్నాయి. జనవరి 30న మరియగిరి మహోత్సవం జరగనున్నది.
ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ అఫ్ చర్చిస్ (APFC) 23 జనవరి 2024న కర్నూలులోని జీవ సుధా పాస్టరల్ సెంటర్లో కడప మేత్రాసన పాలనాధికారి మహా పూజ్య గాలి బాలి గారు మరియు కర్నూలు మేత్రాసన పాలనాధికారి మొన్సిగ్నోర్ గురుశ్రీ చౌరప్ప గారి మార్గదర్శకత్వంలో రాయలసీమ ప్రాంతీయ తాత్కాలిక కమిటీ సమావేశం జరిగింది.
పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు యువకులకు సత్యోపదేశం (‘Youth Catechism of the Catholic Church ) యొక్క కొత్త ఎడిషన్‌తో పాటుగా ఒక లేఖను విడుదల చేసారు .క్రీస్తు ప్రభువు ఆనందకరమైన జీవితానికి పాస్వర్డ్’ అని , క్రీస్తుతో జీవించడంలోనే అది సాధ్యపడుతుందని అన్నారు.
ఆదిలాబాద్ మేత్రాసనం సువార్త విభాగం, బెల్లంపల్లి AMC గ్రౌండ్ లో జనవరి 19, 20, 21 శుక్ర, శని, ఆదివారాలలో మూడు రోజుల పాటు జీవస్వరం 2024 ఆధ్యాత్మిక స్వస్థత కూటములను నిర్వహించింది.
19 జనవరి 2024 న సికింద్రాబాద్ లోని జ్యోతిర్మయి లో TCBC (తెలుగు పీఠాధిపతుల సమాఖ్య) ప్రాంతీయ డైరెక్టర్ల వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ కమిషన్ల డైరెక్టర్లు వారి వార్షిక నివేదికలను సమర్పించారు.
తెలంగాణ ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు 2024-25 విద్యా సంవత్సరంలో మైనారిటీ విద్యార్థులకు పాఠశాలలు & కళాశాలల్లో ప్రవేశాల కొరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు అని మేనేజింగ్ డైరెక్టర్ TS క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు తెలియచేసారు.
విజయవాడ మేత్రాసనం, ఉంగుటూరు మండలం, పెద అవుటపల్లి లో బ్రదర్ జోసఫ్ తంబి గారి 79వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 4వ తేదీ నుండి జరుగుతున్న నవదిన ప్రార్ధనలు 12 శుక్రవారం రాత్రితో ముగిసాయి.