పవిత్రాత్మ నుండి వచ్చే దానిని మత చట్టం ఆపలేదు - వియన్నా అగ్రపీఠాధిపతులు
వియన్నా కొత్త అగ్రపీఠాధిపతులు ఆస్ట్రియా బిషప్‌ల సమావేశ ప్లీనరీలో ప్రసంగిస్తూ, మహిళల పాత్రలలో మార్పు రావాలని పిలుపునిచ్చారు మరియు మత చట్టాలు పవిత్రాత్మను అడ్డుకోలేదని అన్నారు.
మార్చి 11న స్టిరియాలోని ఒక విచారణ లో జరిగిన ఆస్ట్రియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ వసంతకాల ప్లీనరీలో వియన్నా అగ్రపీఠాధిపతులు జోసెఫ్ గ్రున్విడ్ల్ గారు ప్రసంగించారు.
ఆయన మాట్లాడుతూ "పునరుద్ధరణ మరియు మార్పు" సాధ్యమయ్యే శ్రీసభ కోసం పిలుపునిచ్చారు. పవిత్రాత్మ నుండి వచ్చే దానిని మత చట్టాలు ఆపలేవని ఆస్ట్రియా పీఠాధిపతులకు చెప్పారు. దీనిని తాను గట్టిగా నమ్ముతున్నట్లు అగ్రపీఠాధిపతులు జోసెఫ్ గారు చెప్పారు. ఇది శ్రీసభ లో మహిళల పాత్రకు కూడా వర్తిస్తుందని ఆయన అన్నారు.
ఈ సందర్భముగా మార్చి 10న ప్రచురించబడిన, సినోడ్ అధ్యయన బృందం యొక్క తుది నివేదిక అయిన "శ్రీసభ జీవితం మరియు నాయకత్వంలో మహిళల భాగస్వామ్యం"పై ఇటీవల వెలువడిన వాటికన్ నివేదికను జోసెఫ్ గారు ప్రస్తావించారు .
Article and Design By M Kranthi Swaroop