'పెరుగుతున్న పర్యావరణ క్షీణత' పట్ల పరిశుద్ధ లియో పాపు గారు విచారం వ్యక్తం చేశారు

కొలంబియాలోని బొగోటాలో జరుగుతున్న అమెజోనియా సమావేశం కు పరిశుద్ధ లియో పాపు గారు మంగళవారం ఒక వీడియో సందేశాన్ని పంపారు. మార్చి 17-19వరకు ఈ సమావేశం జరిగింది.

పరిశుద్ధ లియో పాపు గారు మాట్లాడుతూ "ఈ ప్రాంతం భూమిపైనే అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం అని , ఇది తొమ్మిది దక్షిణ అమెరికా దేశాల మధ్య విస్తరించి ఉంది అని , అయితే సహజ పర్యావరణం "పెరుగుతున్న క్షీణత" పట్ల లియో పాపు గారు విచారం వ్యక్తం చేశారు.

"ఈ ప్రాంత నివాసుల బాధలు, ఆశలు, అలాగే వారి సహజ పర్యావరణం అంతకంతకూ క్షీణిస్తున్న తీరును మీరు నాకు స్పష్టంగా తెలియజేశారు. ఈ పరిస్థితితో బాధపడుతున్న వారందరికీ నా సాన్నిహిత్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాను," అని లియో పాపు గారు అన్నారు .

ఈ సందర్భముగా నెమ్మదిగా పెరిగినా వెయ్యి సంవత్సరాలకు పైగా జీవించి, అనేక జాతులకు ఆశ్రయంగా ఇస్తూ , తనంతట తానుగా ఒక జీవావరణ వ్యవస్థగా మారే "షిహువాహువాకో" అనే చెట్టును ఉదాహరణగా తీసుకొని సేవ చేయాలనీ లియో పాపు గారు పిలుపునిచ్చారు .

ఈ సమావేశానికి హాజరైనందుకు ఆయన పీఠాధిపతులకు, గురువులకు, సన్యాసులకు మరియు సామాన్య విశ్వాసులకు లియో పాపు గారు ధన్యవాదాలు తెలిపారు.

"ఎక్లేసియల్ కాన్ఫరెన్స్ అఫ్ ది అమేజాన్" అనేది అమెజాన్ ప్రాంతంలోని తోలిక సమాఖ్య. ఇది శ్రీసభ పరిధిలో పనిచేస్తూ, అమెజాన్ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక, సామాజిక, పర్యావరణ సమస్యలపై దృష్టి పెడుతుంది.ఇది ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ మరియు స్థానిక ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణాల కొరకు పనిచేస్తుంది

 

.

Article and Design by 

M kranthi Swaroop