మఠవాసులు దేవుని ప్రేమకు ప్రతిబింబంగా ఉండాలన్న పోప్
ఫిబ్రవరి 21, 2026, పాప్ లియో XIV Missionary Oblates of Mary Immaculate మరియు the Sisters of Our Lady of Apostles సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రపంచంలోని దుర్బల ప్రాంతాల్లో మరియు అత్యంత బలహీనుల మధ్య తమ సేవను నిరంతరం కొనసాగించాలని ప్రోత్సహించారు.
తమ సంఘాల్లో కుటుంబ భావాన్ని బలపరచాలని ఆయన కోరారు.
ఈ రెండు మత సంఘాల సభ్యులతో మాట్లాడిన పోప్, కష్టసాధ్య ప్రాంతాల్లో మరియు పేదల మధ్య తమ పరిచర్యను పట్టుదలతో కొనసాగించాలని పిలుపునిచ్చారు.
మత జీవితంలో ఐక్యత మరియు సోదరభావం ఎంతో ముఖ్యమని ఆయన గుర్తుచేశారు.
“అంకితమైన మత జీవులు మరియు నిజమైన క్రైస్తవ విశ్వాసులకు కుటుంబ భావాన్ని మొదట దేవునితో కలయిక ద్వారా పొందుతారు —
దివ్య సత్ప్రాసదాము ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, దేవుని వాక్యాన్ని వినడం ద్వారా, మరియు దివ్య సంస్కారాల ద్వారా, మనం దేవునితో ఐక్యం అవుతాం తన సందేశంలో ఆయన అన్నారు.
Missionary Oblates of Mary Immaculate నియమావళిని పాపల్ ఆమోదం లభించిన 200వ వార్షికోత్సవం,సిస్టర్స్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ అపోస్టల్స్ స్థాపనకు 150వ వార్షికోత్సవం అయ్యాయి.
రెండు సంఘాల చరిత్రలు వేర్వేరు అయినప్పటికీ, అవి స్థాపించబడిన కాలం, ఫ్రెంచ్ మూలాలు మరియు ముఖ్యంగా “మిషనరీ పిలుపు” వంటి అనేక అంశాల్లో సామ్యాలు ఉన్నాయని పోప్ పేర్కొన్నారు.