పోప్ లియో అపోస్తొలిక పర్యటన వివరాలను ఖరారు చేసిన వాటికన్

పోప్ లియో దక్షిణ అమెరికా అపోస్తలిక పర్యటన తేదీలను అధికారికంగా ప్రకటించిన వాటికన్. 

నవంబర్ 6 నుంచి 17 వరకు జరిగే ఈ పర్యటనలో పోప్ ఉరుగ్వే, అర్జెంటీనా, పెరూ దేశాలను సందర్శించనున్నారు. 

ఈ మూడు దేశాల పర్యటనలో విశ్వాసులతో సమావేశాలు, దివ్యబలిపూజలు, శ్రీసభ సేవా కార్యక్రమాల సందర్శనలు ప్రధానంగా ఉండనున్నాయి.

నవంబర్ 6 నుంచి 8 వరకు ఉరుగ్వేలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా  Paysandú నగరాన్ని సందర్శించి, Casavalle ప్రాంతంలోని శ్రీసభ సేవా కార్యక్రమాలను పరిశీలిస్తారు.

అనంతరం Montevideo's Centenario Stadiumలో జరిగే విశ్వాసుల మహాసభలో పాల్గొంటారు. అలాగే దేశ పరిరక్షకురాలైన Our Lady of the Thirty-Three తిరునాళ్ల సందర్భంగా ఫ్లోరిడా నగరంలో దివ్యబలిపూజను సమర్పిస్తారు.

తదుపరి నవంబర్ 8 నుంచి 11 వరకు అర్జెంటీనాలో పర్యటించనున్న పోప్, Buenos Aires, Córdoba, అలాగే దేశ పరిరక్షకురాలికి అంకితమైన Luhán బసిలికాను సందర్శించనున్నారు. 

ఉరుగ్వేను చివరిసారిగా 1988లో రెండవ జాన్  పాల్ పోప్ సందర్శించగా, అర్జెంటీనాలో పోప్ పర్యటన చివరిసారిగా 1987లో జరిగింది. దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం ఈ రెండు దేశాలు మళ్లీ పోప్ ను ఆహ్వానించనున్నాయి.

నవంబర్ 11 నుంచి 17 వరకు పెరూ లో  ఏడు రోజుల పాటు పర్యటిస్తారు. పోప్ గా ఎన్నిక కావడానికి ముందు రాబర్ట్ ప్రీవోస్ట్‌గా ప్రసిద్ధి చెందిన పోప్ లియో దాదాపు ఇరవై సంవత్సరాలు పెరూలో మిషనరీగా సేవలందించారు. అనంతరం పెరూ పౌరసత్వం స్వీకరించి అక్కడే పీఠాధిపతిగా సేవ చేశారు. అందువల్ల ఈ పర్యటన పెరూ ప్రజలకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

దక్షిణ అమెరికాలోని కతోలిక విశ్వాసులను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఆశ, ఐక్యత, సువార్త సందేశాన్ని పునరుద్ఘాటించే ఈ అపోస్తలిక పర్యటనకు శ్రీసభతో పాటు ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 

Telugu Survey Popup Image