నవారో-వాల్స్ బహుమతి గ్రహీతను ప్రశంసించిన పోప్ లియో

2026 సంవత్సరానికి నాయకత్వం మరియు దాతృత్వం కొరకు ఇచ్చే Joaquín Navarro-Valls అంతర్జాతీయ బహుమతిని ఇటాలియన్ Tenor Andrea Bocelli  అందుకున్నారు.

వృత్తిపరమైన నైపుణ్యం, నైతిక దృక్పథం మరియు సమాజ సేవను మేళవించిన వ్యక్తులను ఈ పురస్కారం గుర్తిస్తుంది.

ఈ బహుమతిని 2023లో రోమ్‌లోని బయోమెడికల్ యూనివర్సిటీ ఫౌండేషన్ స్థాపించింది.

దీని నాల్గవ ఎడిషన్ సందర్భంగా, పోప్ లియో ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ఒక సందేశాన్ని పంపారు. ఆ మాటలు వేడుకకు హాజరైన వారందరి హృదయాలను ఎంతగానో కదిలించాయి.

ఈ రోజు ఈ లేఖను అందుకుని, చదవడం నాకు గొప్ప భావోద్వేగాన్ని కలిగించింది అని బయోమెడికల్ యూనివర్సిటీ ఫౌండేషన్ అధ్యక్షుడు అలెశాండ్రో పెర్నిగో అన్నారు 
 
నన్ను ఎక్కువగా కదిలించిన విషయం ఏమిటంటే, మానవత్వం తన సౌందర్యాన్ని ఎప్పటికీ కోల్పోకుండా ఉండేందుకు, మనమందరం కలిసి మంచితనాన్ని నిర్మించుకోవాల్సిన ప్రాముఖ్యతను పోప్ తన మాటల ద్వారా మనకు గుర్తు చేశారు.

ఆండ్రియా బొసెల్లి తన కళాత్మక వృత్తికి మాత్రమే కాకుండా, విద్యా, సమ్మిళిత, మరియు సమాజ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రోత్సహించే తన ఫౌండేషన్ ద్వారా చూపిన సామాజిక నిబద్ధతకు కూడా గుర్తింపు పొందారు.

ఈ బహుమతికి జోక్విన్ నవారో-వాల్స్ పేరు పెట్టారు. ఆయన 22 సంవత్సరాల పాటు రెండవ జాన్ పాల్ పోప్ యొక్క అధికార ప్రతినిధిగా పనిచేశారు మరియు కమ్యూనికేషన్లలో పోప్ అత్యంత విశ్వసనీయ సహచరులలో ఒకరు.