ఓస్టియాలో పర్యటించిన పోప్ లియో
రోమ్ పీఠాధిపతియైన పోప్ లియో ఫిబ్రవరి 15 న ఓస్టియాలో, Santa Maria Regina Pacis విచారణకు తన మొదటి స్థానిక పాస్టరల్ సందర్శనను చేసారు. ఇది రోమ్ సబర్బన్ మేత్రాసనాలలో అత్యంత ముఖ్యమైన దేవాలయంగా పరిగణించబడుతుంది
మేత్రాసన గురువులకు, మఠవాసులకు మరియు విశ్వాసులకు చేరువగా ఉండటానికి పోప్ తన ప్రాంతీయ పాస్టోరల్ సందర్శనలు ప్రారంభించారు
మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపివేయాలని 15 వ బెనెడిక్ట్ పొప్ ఈ దేవాలయాన్ని ఎన్నుకొన్నారు, ఇది పోప్ లియో శాంతి స్థాపన కృషికి సమాంతరంగా ఉంది
ఆ ప్రదేశం అగస్టీనియన్ మూలాలను కలిగి ఉన్నందున తాను ఓస్టియాను సందర్శించడానికి సంతోషంగా ఉన్నానని పోప్ అన్నారు.
తన సందర్శన సమయంలో అనారోగ్యంతో ఉన్నవారిని,వృద్ధులను, యువకులను మరియు పిల్లలను పోప్ లియో కలిసారు.
ఓస్టియా కథోలికులనే కాక ఇతరు మతస్థులను ఎల్లప్పుడూ స్వాగతించే సమాజంగా ఉన్నారు,ఈ ఉదాహరణకి ధన్యవాదాలు అని పోప్ అన్నారు .
20వ శతాబ్దం మధ్యకాలం నుండి దాదాపు అందరు పోప్‌లు ఈ విచారణను సందర్శించారు.