ఇండొనేషియా భూకంప భాదితుల కొరకు ప్రార్ధించిన పోప్
ఇండొనేషియాలో ఆగస్టు 15న సంభవించిన భూకంపం వల్ల నష్ఠపోయిన వారందరికి పోప్ లియో తన సానుభూతిని వ్యక్తం చేశారు.
ఇండొనేషియాలోని East Nusa Tenggara ప్రాంతంలో సంభవించిన 7.7 తీవ్రత గల భూకంపం వల్ల జరిగిన విధ్వంసం తనను తీవ్రంగా కలచివేసిందని పోప్ తెలిపారు.
ఈ విపత్తులో 53 మంది మరణించగా, 135 మంది గాయపడ్డారు. దాదాపు 13 వేల మంది నిరాశ్రయులయ్యారు.
వాటికన్ రాష్ట్ర కార్యదర్శి కార్డినల్ పియాట్రో పరొలిన్ సంతకంతో పంపిన సందేశంలో, బాధితులకు, ముఖ్యంగా గాయపడినవారికి మరియు ఇళ్లను కోల్పోయినవారికి పోప్ తన సాన్నిహిత్యాన్ని తెలియజేశారు.
మానవతా సహాయక చర్యలను కొనసాగిస్తున్న చర్చి మరియు ప్రభుత్వ అధికారులను ఆయన ప్రోత్సహించారు. సహాయక, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటున్న సిబ్బంది కోసం కూడా ప్రార్థించారు.
భూకంపంలో మరణించిన వారిని దేవుని కరుణకు అప్పగిస్తూ, బాధిత కుటుంబాలకు ఓదార్పు, ధైర్యం ప్రసాదించాలని పోప్ ప్రార్థించారు.
ఈ భూకంపాల కారణంగా ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, చర్చిలతో పాటు అనేక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందలాది ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి, వేలాది మంది తాత్కాలిక ఆశ్రయాల్లో తలదాచుకుంటున్నారు.
