సోమాలియాలో మానవతా సంక్షోభం ముగియాలని ప్రార్థించిన పోప్ లియో

సెప్టెంబర్ 20 ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో త్రికాల ప్రార్థన సందర్భంగా పోప్ లియో సోమాలియాలో నెలకొన్న మానవతా పరిస్థితిని గుర్తుచేశారు.

సోమాలియాలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న హింసకు ముగింపు పలకాలని పోప్ లియో ప్రార్థించారు.

హింసాత్మక ఘటనలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు అక్కడి ప్రజల ఇప్పటికే దుర్భరంగా ఉన్న జీవన పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయి. 

ముఖ్యంగా మహిళలు, చిన్నారులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు” అని పోప్ అన్నారు.

బాధితులకు అవసరమైన సహాయం అందేలా అంతర్జాతీయ సంస్థలు “ఉదారంగా స్పందించాలని” పోప్ ఆకాంక్షించారు.

ఇటీవలి నెలల్లో ఐక్యరాజ్యసమితికి చెందిన పలు సంస్థలు సోమాలియాకు అందిస్తున్న మానవతా సహాయాన్ని గణనీయంగా తగ్గించాయి.

ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (OCHA) తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటికే తగ్గించిన బడ్జెట్‌లో కేవలం మూడో వంతు మాత్రమే నిధులు సమకూరాయి.

అలాగే, ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) కూడా ఆహార సహాయాన్ని తగ్గించింది. గతంలో 20 లక్షల మందికి అందుతున్న సహాయం, 2026లో కేవలం 6 లక్షల మందికి మాత్రమే పరిమితమైంది.

2026లో ఈ ప్రాంతంలో వర్షపాతం సాధారణ స్థాయి కంటే గణనీయంగా తక్కువగా నమోదైంది. దీంతో అనేక కుటుంబాలు నీటి కోసం తమ పశువుల మందలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

1991లో మొహమ్మద్ సియాద్ బారే పాలన పతనమైనప్పటి నుంచి సోమాలియా అంతర్గత సంఘర్షణలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో తమ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి.
 

Telugu Survey Popup Image