కోరుకొల్లు విచారణలో వైభవంగా జరిగిన వ్యాకులమాత మొదటి వార్షికోత్సవం

విజయవాడ మేత్రాసనము, కోరుకొల్లు విచారణ "వ్యాకులమాత మొదటి వార్షికోత్సవం"ఘనంగా సెప్టెంబర్ 28, 29 మరియు 30 తారీకులలో ఘనంగా నిర్వహించడం జరిగింది. 

మూడవ రోజు సెప్టెంబర్ 30 పండుగ దివ్యబలి పూజను నెల్లూరు సహవారస పీఠాధిపతులు మహా ఘన శ్రీ శ్రీ శ్రీ పిల్లి ఆంథోనీ దాస్ గారు దివ్యబలిపూజను సమర్పించి చిన్న బిడ్డలకి నూతన దివ్యసత్ప్రసాదము మరియు భద్రమైన అభ్యంగము దివ్య సంస్కారములను అందించారు. 

1500 మంది విచారణ విశ్వాసులు భక్తి శ్రద్ధలతో దివ్యపూజలో పాల్గొని దేవుని దీవెనలు పొందారు. 

ఈ పండుగ దివ్యబలి పూజను సమర్పించిన పీఠాధిపతులు, విచ్చేసిన గురువులకు సహకరించిన 17 గ్రామాలలో ఉన్న విశ్వాసులకి , విచారణ లో పని చేస్తున్న కన్యాస్త్రీలకు, ఉపదేశులకు, సంఘపెద్దలకు, మరియదళ సభ్యులకు మరియు యువతి యువకులందరికీ కోరుకొల్లు విచారణ కర్తలు గురుశ్రీ గూడపాటి ప్రతాప్ గారు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ పండుగ విశ్వాసులందరికి మంచి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. 
 

Telugu Survey Popup Image