యూరప్ భవిష్యత్తుపై పోప్ లియో సందేశం
ఫ్రాన్స్‌లోని మెట్జ్ ప్రాంతం ఒకప్పుడు ఫ్రాన్స్, జర్మనీ మధ్య జరిగిన రక్తపాత ఘర్షణలకు వేదికగా నిలిచింది. నేడు అదే ప్రాంతం సయోధ్యకు, యూరోపియన్ ఐక్యతకు ప్రతీకగా మారింది.
మెట్జ్‌లోని సెయింట్ స్టీఫెన్ కేథడ్రల్‌లో జరిగిన దివ్యబలిపూజలో పోప్ లియో గతంలోని గాయాలను గుర్తుచేస్తూ, క్షమాపణ, సయోధ్య మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
ప్రతీకారం కోరుకునేవారే బలవంతులు అనేది నిజం కాదు. సయోధ్యను కోరుకునేవారు బలహీనులు అనేది కూడా నిజం కాదు. కలిసి నడిచే సవాలును స్వీకరించడమే నిజమైన బలం” అని పోప్ అన్నారు.
లోతైన గాయాలు ఉన్నప్పటికీ చెడుకు లొంగిపోకుండా నిలబడటానికి ఎంతో బలం, ధైర్యం అవసరమని ఆయన చెప్పారు.
యూరప్‌కు క్రైస్తవ మూలాలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్న పోప్ లియో, మానవ గౌరవం, స్వేచ్ఛ, కుటుంబ విలువలు, బలహీనుల పట్ల శ్రద్ధ వంటి విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.
కేథడ్రల్‌లోని రంగురంగుల అద్దాల కిటికీలను ప్రస్తావిస్తూ, భిన్నత్వాల మధ్య సామరస్యమే యూరప్ భవిష్యత్తని పోప్ అన్నారు.
మెట్జ్ క్రైస్తవులు యూరప్‌కు ఆశాకిరణంగా నిలవాలని పోప్ లియో పిలుపునిచ్చారు.
