ఘనంగా ద్రాక్షారామం విచారణలో పిల్లల శిబిరం
ఘనంగా ద్రాక్షారామం విచారణలో పిల్లల శిబిరం
విశాఖ అతిమేత్రాసనం ద్రాక్షారామం విచారణలో పిల్లల శిబిరం ఘనంగా నిర్వహించారు. విచారణ కర్తలు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ శిబిరం పిల్లలకు నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడేలా సాగింది. రాజమండ్రి విచారణ సహాయక గురువులు గురుశ్రీ కె. ప్రభాకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు వివిధ విషయాలను బోధించారు, యువతకు ప్రేరణాత్మక వీడియోలను చూపించారు, పిల్లల కోసం అనేక ఆటల పోటీలను కూడా నిర్వహించారు.
దాదాపు 115 మంది పిల్లలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ద్రాక్షారామం విచారణ సహాయక గురువులు గురుశ్రీ విమల్ రాజ్ గారు, కనొస కాన్వెంట్ - కనోషియన్ డాక్టర్స్ సోషల్ సర్వీస్ సొసైటీ ఇంచార్జ్ సుపీరియర్ సిస్టర్ దీప గారు మరియు విచారణ యువత ఈ కార్యక్రమానికి సహకరించారు.
విచారణ గురువులు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారు ఈ కార్యక్రమం విజయవతంగా జరగడానికి సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer