కొత్త ఆలోచనలు… కొత్త ఆవిష్కరణలపై సదస్సు

Imagination and Innovation అనే అంశంపై ప్రత్యేక సదస్సును నిర్వహించారు.

కొత్త ఆలోచనలు… కొత్త ఆవిష్కరణలపై సదస్సు

గజపతినగరంలోని డివైన్ సేవియర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో “ఊహాశక్తి మరియు నూతన ఆవిష్కరణలు” (Imagination and Innovation) అనే అంశంపై ప్రత్యేక సదస్సును నిర్వహించారు.

స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ రోస్లిన్ సెబాస్టియన్ గారి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు, ఊహాశక్తి, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.

ఈ సదస్సులో ఫాదర్ వేలాంగణి రాజు గారు పాల్గొని, విద్యార్థులకు అమూల్యమైన సూచనలు, సలహాలు అందించారు. ఊహాశక్తిని సృజనాత్మకంగా ఉపయోగించుకోవడం, కొత్త ఆలోచనలకు రూపకల్పన చేయడం, సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేయడం గురించి విద్యార్థులకు వివరించారు.

విద్యార్థులందరూ ఈ సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్నారు. పేపర్‌ను ఉపయోగించి వివిధ రకాల సృజనాత్మక నమూనాలను రూపొందిస్తూ తమ ఊహాశక్తి, సృజనాత్మకతను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని తమ సహాయ సహకారాలను అందించారు. 

 

Article and Design By M Kranthi Swaroop

Telugu Survey Popup Image