ఇస్లామాబాద్‌లో 200 మందికి పైగా పిల్లలు తొలి దివ్య సత్ప్రసాదం స్వీకరణ
ఇస్లామాబాద్‌లో 200 మందికి పైగా పిల్లలు తొలి దివ్య సత్ప్రసాదం స్వీకరణ
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా దేవాలయం (Our Lady of Fatima) లో 200 మందికి పైగా బాలబాలికలు "మొదటి దివ్యసత్ప్రసాదము" (First Holy Communion) ను స్వీకరించారు.
సుమారు 800 మంది విశ్వాసులు ఈ దేవాలయ వార్షిక వేడుకకు హాజరయ్యారు. విచారణకర్తలు ఫాదర్ సిల్వెస్టర్ జోసెఫ్ మరియు సహాయక గురువు ఫాదర్ నవన్ మారియో, OP గార్ల ఆధ్వర్యంలో ఈ వేడుక ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా దేవాయలం అంతర్భాగాన్ని పుష్పాలు, కొవ్వొత్తులు, ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్దారు. ఇస్లామాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
1979లో నిర్మించి ఆశీర్వదించబడిన అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా చర్చి, ప్రస్తుతం సుమారు 1,600 కాథలిక్ కుటుంబాలకు ఆధ్యాత్మిక కేంద్రంగా సేవలందిస్తోంది.
నెలల తరబడి జరిగిన ఆధ్యాత్మిక శిక్షణ అనంతరం ఈ కార్యక్రమం జరిగింది. ఆరుగురు మతబోధకులు మరియు పద్నాలుగు మంది సండే స్కూల్ ఉపాధ్యాయులతో కూడిన ఒక బృందం నాలుగు నెలల పాటు పిల్లలను ఆధ్యాత్మికంగా సిద్ధం చేసింది.
మొదటి పవిత్ర దివ్య సత్ప్రసాద అనంతరం పిల్లలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఫాదర్ సిల్వెస్టర్ జోసెఫ్ గారు పాపాలను ఒప్పుకోవడం మరియు దివ్య సత్ప్రసాద సంస్కారాల యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
“ఈ అందమైన వేడుకకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ పిల్లలు పవిత్ర దివ్య సత్ప్రసాదం ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము” అని విచారణ పెద్దలు పేర్కొన్నారు.
Article and Design by M kranthi Swaroop
