విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, జ్ఞానం మరియు ప్రశాంతతను పెంపొందేలా ప్రత్యేక ప్రార్థనలు
విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, జ్ఞానం మరియు ప్రశాంతతను పెంపొందేలా ప్రత్యేక ప్రార్థనలు
భారతదేశం అంతటా 10వ తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభం కావడంతో, అనేక కతోలిక పాఠశాల చాలా కాలంగా అనుసరిస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నాయి. పరీక్షలకు ముందు పాఠశాల విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, జ్ఞానం మరియు ప్రశాంతతను పెంపొందించడానికి ప్రత్యేక ప్రార్థనలు (Exam Prayers) నిర్వహించాయి.
ఒడిశాలో, ఫిబ్రవరి 19న ప్రారంభమై మార్చి 2, 2026 వరకు జరిగే హైస్కూల్ సర్టిఫికేట్ (HSC) పరీక్షలకు ముందు క్రైస్తవ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు మరియు విద్యా సంస్థలలో జరిగే ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం 561,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.
పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టి, చదివిన విషయాలను పరీక్షలో గుర్తుతెచ్చుకోవడానికి, దేవుని ప్రేమపై నమ్మకం ఉంచాలని, ఏకాగ్రతతో ఉండాలని ఈ ప్రార్థన బోధిస్తుంది.
ఈ ప్రార్థనలు విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని మరియు పరీక్షలకు సిద్ధమయ్యే నమ్మకాన్ని ఇస్తాయి విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఒడిశాలోని వివిధ మేత్రాసనాలలోని ఫాదర్ లు విద్యార్థుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో కలిసి, జపమాల ప్రార్థనలు చేశారు. దేవుని వాక్యాలను విన్నారు మరియు ఆరాధనకు హాజరయ్యారు.కటక్-భువనేశ్వర్ అగ్రపీఠంలో వికార్ జనరల్ ఫాదర్ ప్రదోష్ చంద్ర నాయక్ గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. యాకోబు 2:26 గుర్తుచేస్తూ "నిజమైన విశ్వాసానికి మంచి పనులు, ప్రేమ, సేవ తోడవ్వాలి" అని "ఆచరణ లేని నమ్మకం వల్ల ప్రయోజనం లేదు" అని క్రమశిక్షణతో కూడిన అధ్యయనం మరియు పట్టుదలతో కూడి ఉండాలని ఆయన వారికి గుర్తు చేశారు. అనంతరం విద్యార్థుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు.
Article and design by
M kranthi Swaroop