లయోలా కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

చెన్నైలోని ప్రఖ్యాత లయోలా కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆగస్టు 9, 2026 ఆదివారం, లయోలా కళాశాలలో జరిగింది.

లయోలా కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

చెన్నైలోని ప్రఖ్యాత లయోలా కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆగస్టు 9, 2026 ఆదివారం,  లయోలా కళాశాలలో జరిగింది.

లయోలా కళాశాలలో జరిగిన ఈ  పూర్వ విద్యార్థుల వేడుకలో  ప్రముఖ నటుడు సూర్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 30 ఏళ్ల తర్వాత తన కాలేజీకి వెళ్లిన ఆయన, పాత రోజులను గుర్తు చేసుకుంటూ విద్యార్థులతో జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఈ ప్రతిష్టాత్మక లోయోలా కాలేజ్ ప్రిన్సిపాల్ గా  ఫాదర్  డాక్టర్ ఎ. లూయిస్ అరోకియారాజ్ SJ గారు, కరస్పాండెంట్‌ గా ఫాదర్ డాక్టర్ డి. థామస్ అలెగ్జాండర్ SJ గారు విధులు నిర్వహిస్తున్నారు. 

“1925లో ప్రారంభమైన లయోలా కళాశాల.. దాదాపు వందేళ్లుగా విద్యా సేవలను కొనసాగిస్తూ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థగా ఎదిగింది.” ఎందరో ప్రముఖ పూర్వ విద్యార్థులు ఈ సంస్థ నుండి పట్టభద్రులయ్యారు మరియు వారి వారి రంగాలలో దిగ్గజాలుగా ఉన్నారు.

లోయోలా కాలేజ్ లో చదువు కున్న  ప్రముఖులలో ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ సి. జోసెఫ్ విజయ్, కేంద్ర మాజీ మంత్రి శ్రీ దయానిధి మారన్ , శ్రీ ఉదయనిధి స్టాలిన్ ,  మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం, క్రీడలలో శ్రీ విశ్వనాథన్ ఆనంద్,విజయ్ అమృత్‌రాజ్, శ్రీ రమేష్ కృష్ణన్, నటులలో సూర్య , మహేష్ బాబు, వెంకటేష్ దగ్గుబాటి  , విక్రమ్, విజయ్ ఆంటోనీ ఇతరులు వున్నారు. 

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 19వ గవర్నర్‌గా పనిచేసిన ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సి. రంగరాజన్ గారికి   చెన్నైలోని లయోలా కాలేజ్ (Loyola College) తో విద్యార్థిగా మరియు అధ్యాపకుడిగా రెండు రకాల విడదీయరాని అనుబంధాలు ఉన్నాయి.

“విద్యను ఒక సేవగా భావించిన జెస్యూట్ మిషనరీలు మన దేశం లో  కులం, మతం, ఆర్థిక స్థితి వంటి భేదాలకు అతీతంగా విద్యను అందిస్తూ, సమాజంలోని వెనుకబడిన వర్గాలకు కూడా అవకాశాలు కల్పించారు.”

మన దేశంలో  ప్రతి ఒక్కరికీ విద్య అందాలనే గొప్ప లక్ష్యంతో ప్రారంభమైన ఈ "క్రైస్తవ విద్యాసంస్థ".. దాదాపు వందేళ్లుగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలకు వెలుగునిచ్చింది.

 

Article and Design By M Kranthi Swaroop
RVA Telugu Online Content Producer 
 

Telugu Survey Popup Image