"సెయింట్ జాన్ పాల్ II"పై దాడి జరిగిన చోట పోప్ లియో ప్రార్థనలు
ఫాతిమా మాత పండుగ రోజు "సెయింట్ జాన్ పాల్ II"పై దాడి జరిగిన చోట పోప్ లియో ప్రార్థనలు
2026 మే 13వ తేదీ బుధవారం నాడు వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో అద్భుతమైన ఘట్టం చోటుచేసుకుంది.
45 సంవత్సరాల క్రితం (13 మే 1981 న) సెయింట్ జాన్ పాల్ II పాపు గారి పై హత్యాయత్నం జరిగిన ప్రదేశానికి పరిశుద్ధ లియో పాపు గారు నడిచి వెళ్లారు. అక్కడ ఉన్న తెల్లటి రాతి స్మారక పలక (Marble Plaque) వద్ద మోకరిల్లి, నిశ్శబ్దంగా ప్రార్థన చేశారు.
ఆ రోజు 'ఫాతిమా మాత ' (Our Lady of Fatima) పండుగ కావడంతో, పరిశుద్ధ లియో పాపు గారు తన ప్రసంగాన్ని మరియా మాతకి అంకితం చేశారు. 1981 లో జరిగిన దాడి నుండి సెయింట్ జాన్ పాల్ II పాపు గారు ప్రాణాలతో బయటపడటం దైవిక పవిత్రతకు నిదర్శనమని ఆయన గుర్తుచేసుకున్నారు.
1981 మే 13న వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో సెయింట్ జాన్ పాల్ II పాపు గారి పై హత్యాయత్నం జరిగింది. బహిరంగ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తుండగా, మెహ్మెట్ అలీ అగ్కా అనే టర్కీ దేశస్తుడు ఆయనపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన పాపు గారు , సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
పోప్ పొత్తికడుపులో, ఎడమ చేతిలో బుల్లెట్లు దిగాయి. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరారు. ఆయన కోలుకున్న తర్వాత 1983లో జైలులో తనపై దాడి చేసిన అగ్కాను కలిసి క్షమించారు.
Article and Design By M. Kranthi Swaroop