భూకంప బాధితులకు అండగా క్యాథలిక్ చర్చ్
వెనిజులా విపత్తు | భూకంప బాధితులకు అండగా క్యాథలిక్ చర్చ్
వెనిజులాలో కష్టకాలంలో ఉన్న ప్రజలకు శ్రీసభ (క్యాథలిక్ చర్చి) ముందుండి సహాయక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా ఇటీవల సంభవించిన భూకంపాలు, అంతర్గత సంక్షోభాల వల్ల నిరాశ్రయులైన వారికి క్రైస్తవ దేవాలయాలు , వాటి పరిపాలనా భవనాలు ఆశ్రయం కల్పిస్తున్నాయి.
మరోవైపు అమెరికా ప్రభుత్వం కూడా సహాయక చర్యలు చేపడుతున్నాయి. వెనిజులాలో సహాయక చర్యల కోసం అమెరికా నిధులు 300 మిలియన్ డాలర్లకు పైగా పెరిగాయని జూన్ 29న విదేశాంగ శాఖ ప్రకటించింది.
"అమెరికా మానవతా సహాయ నిధులన్నీ క్యాథలిక్ రిలీఫ్ సర్వీసెస్‌తో సహా పలు విశ్వసనీయ అంతర్జాతీయ మరియు ప్రభుత్వేతర భాగస్వాములకు మళ్లించబడ్డాయి" అని విదేశాంగ శాఖ పేర్కొంది.
'జెసూట్ రెఫ్యూజీ సర్వీస్' (JRS) అత్యంత క్రమశిక్షణతో, వ్యవస్థీకృత పద్ధతిలో సహాయక చర్యలను అందిస్తోంది. రాజధాని కారకాస్‌లో సొసైటీ ఆఫ్ జీసస్ (Jesuits) నిర్వహిస్తున్న నెట్వర్క్ కేంద్రాల ద్వారా ఆహారం, మందులు, మరియు నిత్యావసర వస్తువుల పంపిణీని క్రమబద్ధీకరిస్తున్నారు.
జూన్ 24న సంభవించిన ఈ జంట భూకంపాల వల్ల (7.2 మరియు 7.5 తీవ్రత) దేశవ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లింది.ఆర్చ్‌బిషప్ రౌల్ బియోర్డ్ కాస్టిల్లో ప్రజలందరూ ఈ విపత్కర సమయంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ, సంఘీభావం మరియు స్వచ్ఛంద సేవలను (Charity) అందించాలని పిలుపునిచ్చారు.
Article and Design By M kranthi swaroop