డికాస్టరీ ప్రిఫెక్ట్‌గా మరోసారి మహిళను నియమించిన పోప్ లియో
రోమన్ క్యూరియాలో ఒక ఉన్నత పదవికి మరోసారి ఒక మహిళను పోప్ లియో నియమించారు
Salesian సభకు చెందిన సిస్టర్ Alessandra Smerilli సమగ్ర మానవ అభివృద్ధి విభాగానికి ప్రిఫెక్ట్‌గా పోప్ లియో నియమించారు
వాటికన్ విభాగానికి నాయకత్వం వహించిన మూడవ మహిళ సిస్టర్ Alessandra Smerilli
ఇటీవలే కమ్యూనికేషన్ విభాగానికి Montserrat Alvaradoను నియమించారు.
కార్డినల్స్‌కు సాధారణ పదవీ విరమణ వయస్సు 80 ఏళ్లు.
ఈ జూలై 18న Cardinal సీజర్నీ పదవీ విరమణ చస్తున్నా సమయంలో ,సిస్టర్ స్మెరిల్లీ సెప్టెంబర్ 1న పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు అని ప్రకటన పేర్కొంది
.
పవిత్ర జీవిత సంస్థల డికాస్టరీకి సిమోనా బ్రాంబిల్లా మరియు కార్డినల్ ఆర్టిమ్‌లను నియమించినప్పుడు,దివంగత పోప్ ఫ్రాన్సిస్ హయాంలో మొదటిసారిగా ఉపయోగించిన నమూనానే పోప్ లియో ఇప్పుడు కొనసాగిస్తున్నారు.
ఆ సమయంలో, ఈ ఏర్పాటు ఒక విప్లవాత్మకమైనదిగా పరిగణించబడింది.
ఒక మహిళను డికాస్టరీకి ప్రిఫెక్ట్‌గా నియమించడం, మరియు ఒక కార్డినల్ ప్రో-ప్రిఫెక్ట్‌గా వ్యవహరించడం అదే మొదటిసారి.
ఈ నిర్ణయం కానన్ చట్టంతో సాధ్యమయ్యే ఉద్రిక్తతల గురించి ప్రశ్నలను లేవనెత్తింది.
పొప్ లియో ఇప్పుడు అదే విధానాన్ని అవలంబించారు.
సిస్టర్ స్మెరిల్లీ ఈ డికాస్టరీకి నాయకత్వం వహించనుండగా, కార్డినల్ Fabio Baggio ఆమెకు డిప్యూటీగా వ్యవహరించనున్నారు
వలసల వంటి సమస్యలతో వ్యవహరించే ఈ విభాగాంతో వీరిద్దరికీ ఇప్పటికే ఎంతో అనుభవం ఉంది