SIGNIS ASIA నూతన బోర్డు సభ్యుల ఎన్నిక
SIGNIS ASIA నూతన బోర్డు సభ్యుల ఎన్నిక
హో చి మిన్ సిటీ, వియత్నాం | అక్టోబర్ 26, 2026:
ఆసియాలోని కతోలిక మీడియా రంగానికి ఒక ముఖ్యమైన పరిణామంగా, భారతీయ ఫాదర్ విక్టర్ విజయ్ లోబో 2026–2030 కాలానికి సిగ్నిస్ ఆసియ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అక్టోబర్ 26న వియత్నాంలోని సైగాన్ నగరంలో జరిగిన సిగ్నిస్ ఆసియా సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో 14 సభ్య దేశాల్లోని 12 దేశాల ప్రతినిధులు ప్రత్యక్షంగా, ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు.
ఫాదర్ విక్టర్ విజయ్ లోబో కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు పరిధికి చెందిన గురువు . అయన సిగ్నిస్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు.
"కంబోడియాకు చెందిన రేడియో వేరితాస్ ఆసియా" ఆన్లైన్ కంటెంట్ ప్రొడ్యూసర్ కుమారి కగ్నాకియో "సిగ్నిస్ ఆసియ కార్యదర్శిగా" ఎన్నికయ్యారు. "బెంగాల్ రేడియో వేరితాస్ ఆసియా " కోఆర్డినేటర్ ఫాదర్ నిఖిల్ గోమ్స్ "సిగ్నిస్ ఆసియ బోర్డు మెంబెర్" గా ఎన్నికయ్యారు.
ఎన్నికైన ఇతర సభ్యులు, ఉపాధ్యక్షురాలుగా ఫిలిప్పీన్స్ కు చెందిన మబాంటా-ఫెనోమెనో, కోశాధికారి గా దక్షిణ కొరియా కు చెందిన పాల్ చాన్ నామ్గూంగ్,
కార్యనిర్వాహక మండలి సభ్యుడు కుక్ డైసీ ఫామ్(వియత్నాం),ప్రత్యామ్నాయ ప్రతినిధి (Stand-in Delegate)ఫాదర్ ఖైసర్ ఫెరోజ్, OFM Cap (పాకిస్తాన్) ఎన్నికయ్యారు.
సిగ్నిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా కతోలిక మీడియా, జర్నలిజం, రేడియో, టెలివిజన్, సినిమా, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే వ్యక్తులు, సంస్థలను అనుసంధానించే అంతర్జాతీయ సంఘం.
Article and Design By M Kranthi Swaroop
