అణ్వస్త్ర ఉద్రిక్తతలను అరికట్టే నూతన ఒప్పందాన్ని పరిరక్షించాలన్న పోప్

ఫిబ్రవరి 4 ఆరవ పాల్ హాల్‌లో సమావేశమైన విశ్వాసులతో తన వారపు ప్రజా బోధనను పంచుకున్నారు, ఇది 'డెయ్ వెర్బమ్' అనే దాని పై కేంద్రీకృతమై ఉంది.

దేవుడు పవిత్ర గ్రంథాల ద్వారా మానవాళితో సంభాషించే విధానం గురించి పోప్ మాట్లాడారు.

దేవుడు తన సందేశాలలో, దానిని వ్యక్తపరిచే విధానంలో కూడా దయగలవాడు, మరియు కరుణామయుడు అని మనకు తెలుస్తుంది. అంటే, ఆయన ఉపయోగించే భాష అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది అని పోప్ అన్నారు 

ఈ సమావేశ సమయంలో, పోప్ ప్రస్తుత ప్రపంచ సమస్యలను ప్రస్తావించడానికి కూడా ఈ అవకాశాన్ని తీసుకున్నారు. ముక్యంగా ఉక్రేనియన్ ప్రజలకు తన సాన్నిధ్యాన్ని తెలియజేయడం, వారందరి కోసం ప్రార్థనలు చేయమని కోరారు

బాంబు దాడుల పర్యవసానాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన, మరియు ఇంధన మౌలిక సదుపాయాలను కూడా దెబ్బతీసిన ఉక్రెయిన్‌లోని మన సోదర సోదరీమణులకు ప్రార్థనల ద్వారా మద్దతు ఇవ్వాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను అని పోప్ అన్నారు 

తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉక్రేనియన్ జనాభాకు సహాయం చేయడానికి పోలాండ్ మరియు ఇతర దేశాల కథోలిక మేత్రాసనాలు చేపడుతున్న సంఘీభావ కార్యక్రమాలకు పోప్ ధన్యవాదాలు తెలిపారు.

Telugu Survey Popup Image