జీవిత పవిత్రతపై ఖమ్మం మేత్రాసన గురువులకు ప్రో-లైఫ్‌ అవగాహన

జీవిత పవిత్రతపై ఖమ్మం మేత్రాసన గురువులకు ప్రో-లైఫ్‌ అవగాహన

ఖమ్మం డయాసిస్‌కు చెందిన 70 మందికి పైగా గురువులు   బిషప్ హౌస్‌లో జరిగిన నెలవారీ గురువుల ఆధ్యాత్మిక పునశ్చరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ఖమ్మం మేత్రాసన పీఠాధిపతులు మహా పూజ్య సగిలి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో  CCBI ఫ్యామిలీ కమిషన్ అసోసియేట్ సెక్రటరీ శ్రీ అజిన్ జోసెఫ్ పాల్గొన్నారు. ప్రో-లైఫ్‌ గురించి వివరించారు. శ్రీ అజిన్ జోసెఫ్‌ను మహా పూజ్య సగిలి ప్రకాష్ గారు  స్వాగతించి సత్కరించారు. అనంతరం డయాసిస్ వికార్ జనరల్ మాన్సిగ్నోర్ శౌరి గారు కార్యక్రమానికి పరిచయం చేశారు. తన మొదటి ప్రసంగంలో, శ్రీ అజిన్ జోసెఫ్ గారు యోహాను 21:15–19 వచనాలపై ధ్యానిస్తూ, విశ్వాసులను పోషించాలని, దారి తప్పిన వారిని చేరుకోవాలని, మరియు అందరికీ సువార్తను ప్రకటించాలని యాజకులకు  పిలుపునిచ్చారు.

శ్రీసభ ప్రకారం మనిషి జీవితం దేవుని వరం. అందువల్ల సమాజంలో  బలహీనులైన, పుట్టబోయే శిశువులైన, ప్రతి ఒక్కరి జీవితాన్ని గౌరవించి కాపాడే బాధ్యత శ్రీసభ కలిగి ఉంటుంది.ప్రో-లైఫ్‌ భావన కేవలం గర్భస్రావానికి వ్యతిరేకంగా ఉండటం మాత్రమే కాదు. ఇది మరింత విస్తృతమైన జీవన దృక్పథం.గర్భంలోని శిశువు జీవితాన్ని గౌరవించడం,తల్లి మరియు శిశువుకు అవసరమైన సహాయం అందించడం,కుటుంబం మరియు వివాహ పవిత్రతను కాపాడడం దీని ముఖ్య ఉద్దేశం.

 

Article and Design By M Kranthi Swaroop

Telugu Survey Popup Image