ఆఫ్రికా, మొనాకో మరియు స్పెయిన్‌లను సందర్శించనున్న పోప్ లియో XIV
ఆఫ్రికా, మొనాకో మరియు స్పెయిన్‌లను సందర్శించనున్న పోప్ లియో XIV
హోలీ సీ ప్రెస్ ఆఫీస్ ప్రకటన ప్రకారం, పరిశుద్ధ లియో XIV పాపుగారు 2026 సంవత్సర ప్రథమార్థంలో ఆఫ్రికా, మొనాకో మరియు స్పెయిన్‌లను సందర్శిస్తూ మూడు ప్రధాన అపోస్టోలిక్ ప్రయాణాలను చేపట్టనున్నారు.
ఈ పర్యటన మార్చి 28న మొనాకోకు ఒకరోజు పర్యటనతో ప్రారంభమౌతుంది. తరువాత ఏప్రిల్ 13 నుండి 23 వరకు పది రోజుల పాటు ఏప్రిల్‌లో అల్జీరియా, కామెరూన్, అంగోలా మరియు ఈక్వటోరియల్ గినియా మధ్య ఆఫ్రికాకు మరియు జూన్ 6 నుండి 12 వరకు ఆరు రోజుల పాటు కానరీ దీవులతో సహా స్పెయిన్ పర్యటనతో ముగుస్తుంది.
ఆఫ్రికాలో ఏప్రిల్ 13 నుండి 23 వరకు జరిగే సుదీర్ఘమైన పర్యటనలో ఆయన అల్జీరియాలోని పునీత అగస్టీన్ అడుగుజాడల్లో నడుస్తూ, ముఖ్యంగా అల్జీర్స్ మరియు అన్నాబాలను సందర్శిస్తారు. తరువాత మధ్య ఆఫ్రికాలోని కామెరూన్‌ను సందర్శిస్తారు, యౌండే, బమెండా మరియు డౌలాలో ఆగుతారు. అంగోలాలో ఆయన లువాండా, ముక్సిమా మరియు సౌరిమోలను సందర్శిస్తారు. చివరగా ఈక్వటోరియల్ గినియాలో ఆయన మలాబో, మొంగోమో మరియు బాటాలను సందర్శిస్తారు.
ఈ ప్రయాణం శాంతిపై దృష్టి సారిస్తుంది. పరిశుద్ధ పోప్ లియో XIV గారు కామెరూన్‌కు ఉత్తరాన ఉన్న ఆంగ్లోఫోన్ ప్రాంతానికి వెళతారు, అక్కడ పది సంవత్సరాలుగా సాధారణ సాయుధ దళాలు మరియు వేర్పాటువాదుల మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది.
ప్రతి గమ్యస్థానంలో, పరిశుద్ధ పోప్ లియో XIV గారు శాంతి, సోదరభావం, పేదల కొరకు సందేశాలు మరియు ప్రార్థనలు జరగనున్నాయి.
Article and design
by M Kranthi Swaroop