AI మానవాళికి సేవ చేయాలి కానీ అధికారాన్ని కేంద్రీకరించకూడదు

AI మానవాళికి సేవ చేయాలి కానీ అధికారాన్ని కేంద్రీకరించకూడదు


రెరుమ్ నోవారమ్ యొక్క 135వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, పరిశుద్ధ లియో XIV  పాపు గారు తన మొదటి ఎన్సైక్లికల్‌ను విడుదల చేశారు. పరిశుద్ధ లియో XIV పాపు గారు రాసిన తొలి విశ్వసభ లేఖ (Encyclical)  'మాగ్నిఫికా హ్యూమనిటాస్' ను మే 25, 2026న విడుదల చేసారు .  కృత్రిమ మేధస్సు (AI) కాలంలో మానవ వ్యక్తిగత గౌరవాన్ని, ఉన్నతమైన మానవత్వాన్ని పరిరక్షించడంపై ఈ లేఖ దృష్టి సారించింది.

 సాంకేతికతను ఆయుధంగా ఉపయోగించే ఈ యుగంలో, మనిషిని కేవలం ఒక వస్తువుగా లేదా సాధనంగా మార్చే ఆలోచనలను పోప్ గట్టిగా వ్యతిరేకించారు.సాంకేతిక పురోగతి పేరుతో దేవుడిని, మానవ హక్కులను విస్మరిస్తూ భవిష్యత్తును నిర్మించాలనుకోవడం 'బాబెల్ గోపురం' (Tower of Babel) కట్టడంతో సమానమని హెచ్చరించారు.

సాంకేతికత అభివృద్ధి అనేది కేవలం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదని, ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ సమానమైన మేలును చేకూర్చే విధంగా ఉండాలని స్పష్టం చేశారు.ఈ డిజిటల్ యుగంలో యంత్రాల హడావిడిలో, మనుషుల మధ్య ఉండే సంబంధాలు, ప్రేమ మరియు దయ మరుగున పడకుండా కాపాడుకోవాలని పరిశుద్ధ లియో XIV పాపు గారు కోరారు.

Article and design by M kranthi Swaroop

Telugu Survey Popup Image