వాటికన్ అపోస్టోలిక్ గ్రంధాలయాన్ని సందర్శించిన పోప్
తన 71వ పుట్టినరోజున అనగా సెప్టెంబర్ 14న వాటికన్ అపోస్టోలిక్ గ్రంధాలయాన్ని పోప్ లియో తొలిసారి సందర్శించారు
ఈ సందర్భంగా గ్రంధాలయంలో ఓ ప్రత్యేక ప్రదర్శనను కూడా ప్రారంభించారు. గ్రంధాలయంలోని విలువైన పుస్తకాలు, ప్రాచీన గ్రంథాలను భద్రపరచేందుకు మరింత స్థలాన్ని సిద్ధం చేస్తున్న సమయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్శనలో పోప్ లియో తన కుటుంబానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
మీలో చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. నా తల్లి గ్రంథాలయంలో పనిచేసేవారు అని పోప్ అన్నారు.నా పూర్వీకులు నడిచిన బాటలోనే నేను కూడా ఇక్కడికి వచ్చాను.”
వాటికన్ అపోస్టోలిక్ గ్రంధాలయాన్నిఅధికారికంగా 1475లో స్థాపించారు. శతాబ్దాలుగా ఎన్నో విలువైన గ్రంథాలను ఈ గ్రంధాలయము భద్రపరుస్తోంది.
ఇక్కడ కేవలం వేదాంతానికి సంబంధించిన పుస్తకాలే ఉండవు. తత్వశాస్త్రం, ఖగోళశాస్త్రం, గణితం, వైద్యం వంటి అనేక రంగాలకు చెందిన గ్రంథాలు కూడా ఉన్నాయి.
అంతేకాదు.. ప్రపంచంలోని వివిధ సంస్కృతులు, మత సంప్రదాయాలకు సంబంధించిన రచనలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
గతాన్ని కాపాడుకోవాలి.. కానీ గతంలోనే ఆగిపోకూడదు.గతం నుంచి నేర్చుకుంటూ.. దాన్ని ముందుకు తీసుకెళ్లాలని పోప్ పిలుపునిచ్చారు.
