ప్రతి ఆదివారం పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమం

ప్రతి ఆదివారం పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమం

ప్రతి ఆదివారం పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమం

పేదలకు, నిరుపేదలకు ఆహారం అందించి వారి ఆకలిని తీర్చాలనే సదుద్దేశంతో ప్రతి ఆదివారం ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని శ్రీకాకుళం మేత్రాసనం నిర్వహిస్తుంది. మహా పూజ్య రాయరాలా విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమం జరుగుతుంది. వేదవ్యాపక ఆదివారం నాడు కూడా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 

 శ్రీకాకుళం మేత్రాసనం, బిషప్ హౌస్‌లో ప్రతి ఆదివారం పేదలకు, నిరుపేదలకు ఉచితంగా భోజనం అందించే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందనీయం. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటుతూ, ప్రేమ, కరుణ, సేవాభావాలను సమాజంలో విస్తరింపజేస్తున్నారు. "Every Sunday Let Us Reach the Poor” (ప్రతి ఆదివారం పేదలను చేరుకుందాం) అనే సందేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప మానవతా సేవ. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ కనీస అవసరాలు తీర్చుకోలేని పేదలకు ఉచితంగా భోజనం అందించడం ద్వారా వారికి కొంత ఊరట కల్పించవచ్చు.

సమాజంలో పేదలు, నిరుపేదలు, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా వారి కష్టాల్లో భాగస్వాములం కావచ్చు. ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రతి మేత్రాసనంలో , ప్రతి విచారణనలో  కొనసాగితే ఎంతోమంది పేదలకు ప్రయోజనం చేకూరుతుంది. 

ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం, దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించిన నిజమైన ప్రేమకు నిదర్శనం.

Article and Design By M Kranthi Swaroop

Telugu Survey Popup Image