వేదవ్యాపక ఆదివారం
World Mission Sunday | వేదవ్యాపక ఆదివారం
వేదవ్యాపక ఆదివారం (World Mission Sunday) అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కతోలిక విశ్వాసులు తమ మిషనరీ కార్యానికి గల నిబద్ధతను పునరుద్ధరించుకుంటూ, సువార్తా ప్రచారంలో తమ వంతు బాధ్యతను గుర్తుచేసుకునే ఒక ప్రత్యేకమైన రోజు.
1926లో పోప్ పియస్ XI గారు ప్రపంచ మిషన్ల కోసం ప్రార్థన చేయడానికి, మిషనరీ కార్యాలకు సహకరించడానికి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు.ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటిస్తున్న మిషనరీల కోసం ప్రార్థించడం, వారి సేవలను గుర్తించడం, అవసరాల్లో ఉన్న మిషన్ ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందించడం ప్రధాన ఉద్దేశాలు.మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన సువార్తా ఆజ్ఞను అనుసరిస్తూ, దేవుని ప్రేమను ప్రపంచమంతటా చాటిచెప్పడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి.
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మిషనరీలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, పేదలకు సహాయం చేస్తూ, ప్రేమతో సేవ చేస్తున్నారు. వారి సేవలను మనం గుర్తుచేసుకుందాం. వారి కోసం ప్రార్థిద్దాం. మనకు చేతనైనంత సహాయం అందిద్దాం.
రేడియో వెరితాస్ ఆసియా తెలుగు "దేవుని నామంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, క్రీస్తు ప్రేమను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు చేరవేస్తోంది". మనమందరం దేవుని ప్రేమను మన మాటల ద్వారా మాత్రమే కాకుండా, మన చేతల ద్వారా కూడా ఇతరులకు చూపిద్దాం.
Article and Design By M Kranthi Swaroop
