స్క్రీన్‌లకు కాదు... నిజమైన బంధాలకు ప్రాధాన్యత ఇవ్వండి: పోప్


పరిశుద్ధ లియో XIV పాపు గారు  సోమవారం నాడు వాటికన్‌లోని "ఎస్టేట్ రగాజ్జీ" వేసవి శిబిరాన్ని సందర్శించారు.  వాటికన్ ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ శిభిరంలో  పిల్లలు, యువకులతో సమావేశమై పలు ప్రశ్నలకు పాపు గారు సమాధానమిచ్చారు.

సాంకేతికత యొక్క బాధ్యతాయుతమైన ఉపయోగం మరియు డిజిటల్ వ్యసనంపై పరిశుద్ధ లియో XIV పాపు గారు పిల్లలకు దిశానిర్దేశం చేశారు. వాటికన్ ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన "ఎస్టేట్ రగాజ్జీ" వేసవి శిబిరాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన ఈ సూచనలు చేశారు.

మనకు దేవుడు అద్భుతమైన మేధస్సును ఇచ్చాడని, కేవలం సాంకేతికతపైనే ఆధారపడకుండా సొంతంగా ఆలోచించే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని  పరిశుద్ధ లియో XIV పాపు గారు స్పష్టం చేశారు.

 ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లను నిరంతరం చేతిలో పట్టుకోవాల్సిన అవసరం లేదని, రోజువారీ జీవితంలో పరికరాలకు దూరంగా ఉండే సమయాన్ని కేటాయించుకోవాలని పరిశుద్ధ లియో XIV పాపు గారు సూచించారు. యాప్‌లు మరియు స్క్రీన్‌లకు బానిసలు కాకుండా, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని మరియు నిజమైన స్నేహాలను కొనసాగించాలని పరిశుద్ధ లియో XIV పాపు గారు కోరారు.

"స్నేహాలు పెంచుకోవడం, కలిసి సమయం గడపడం, కలిసి ఆడుకోవడం, బహుశా కలిసి చదువుకోవడం కూడా చాలా ముఖ్యం," అని ఆయన అన్నారు. "మనం మానవులం, వ్యక్తులం, ఇతరులతో సంబంధాలు అత్యంత కీలకం అని అన్నారు . 

"మన ఫోన్లలో బైబిల్ మరియు ప్రార్థనలు ఉన్నప్పటికీ, దేవుడు మన ఫోన్లను చూడాలనుకోడు. దేవుడు మన హృదయాలను, మన జీవితాలను చూడాలనుకుంటాడు అని పరిశుద్ధ లియో XIV పాపు గారు అన్నారు. 

 

Article and Design

M Kranthi Swaroop