మానవత్వానికి ప్రతీకగా WFP సేవలు: పోప్
మానవత్వానికి ప్రతీకగా WFP సేవలు: పోప్
మానవాళికి ఆహారం అందించడం కంటే ప్రపంచ నాయకులు యుద్ధాలు, ఘర్షణలకు మరింత సులభంగా ఆజ్యం పోస్తున్నారని పరిశుద్ధ లియో XIV పాపు గారు విచారం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన పరిశుద్ధ లియో XIV పాపు గారు ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత, రాజకీయ అసమతుల్యతలపై ఘాటుగా స్పందించారు.
సోమవారం నాడు రోమ్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ కార్యనిర్వాహక మండలిని ఉద్దేశించి పరిశుద్ధ లియో XIV పాపు గారు ప్రసంగించారు.
WFP చేస్తున్న పనులను పరిశుద్ధ లియో XIV పాపు గారు అభినందించారు. అత్యవసర పరిస్థితులు, యుద్ధాలు మరియు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడుతూ ఆహార సహాయం అందిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.మన పొరుగువారిని ప్రేమించాలనే సువార్త సందేశానికి ఈ సేవలు అద్దం పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మానవ గౌరవాన్ని కాపాడటం మరియు సోదరభావాన్ని పెంచడం అనే శ్రీసభ ఆశయాలకు, ఈ సంస్థ నిబద్ధతకు ఎంతో దగ్గర పోలిక ఉందని పరిశుద్ధ లియో XIV పాపు గారు వివరించారు.
ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నడూ లేనంతగా ఉత్పత్తి సామర్థ్యం పెరిగినప్పటికీ, మరోవైపు విపరీతమైన ఆకలి, పేదరికం పెరగడం ఒక పెద్ద విచిత్రమైన సంక్షోభం (Paradox) అని పరిశుద్ధ లియో XIV పాపు గారు పేర్కొన్నారు.
పేద దేశాలకు అందాల్సిన సాయం మరియు అభివృద్ధి పనులు కఠినమైన రాజకీయాలు, పట్టింపులు, నిబంధనల వల్ల ఆగిపోతున్నాయి. కానీ, యుద్ధాలు చేసే ఆయుధాల రవాణాకు మాత్రం ఎలాంటి అడ్డంకులు ఉండటం లేదని పరిశుద్ధ లియో XIV పాపు గారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో భాగంగా, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 171 మంది WFP సిబ్బంది స్మారక గోడ వద్ద పరిశుద్ధ లియో XIV పాపు గారు నివాళులర్పించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 466 మిలియన్ల మంది విద్యార్థులకు WFP అందిస్తున్న పాఠశాల భోజన పథకాన్ని ఆయన అభినందించారు.
Article and Design
M kranthi Swaroop